Taliban : ఆ మహిళలను చంపేయటానికి లిస్టు తయారు చేస్తున్న తాలిబన్లు..

అఫ్గాన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు తమ మార్కు పాలన మొదలు పెట్టేశారు. సెక్స్ వర్కర్లును చంపేయటానికి లిస్టు తయారు చేస్తున్నారు.

Taliban : ఆ మహిళలను చంపేయటానికి లిస్టు తయారు చేస్తున్న తాలిబన్లు..

Talibans Searching For Sex Workers Will Kill

talibans searching for sex workers will kill : అఫ్గాన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు తమ మార్కు పాలన మొదలు పెట్టేశారు. నియంత పాలనతో మహిళల పాలిట యమకింకరుల్లా వ్యవహరిస్తున్నారు. వారు చెప్పిందే శాసనం..చేసేదే చట్టం అన్నట్లుగా వ్యవహరిస్తు మారణకాండ సృష్టిస్తున్నారు. కానీ పైకి మాత్రం అంతర్జాతీయ సమాజానికి భయపడి తమలో మార్పు వచ్చినట్లు నటిస్తున్నారు తాలిబన్లు. అధికారికంగా పాలనలోకి రాకపోయినా వారిదే ఇష్టారాజ్యం.

ఆఫ్గనిస్థాన్ నుంచి అమెరికా సేనలు పూర్తిగా వైదొలగడంతో దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు.. ఇక తమ నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటున్నారు. ఆడవాళ్లు ఇలాగే ఉండాలనే ఆంక్షలు..వారు చదువుకోకూడదు..ఉద్యోగాలు చేయకూడదు. అసలు ఇంటినుంచి బయటకే రాకూడదు అంటూ ఆంక్షలు విధిస్తున్నారు. ఇంటినుంచి కాలు బయటపెడితే చంపేస్తాం అంటూ హుకుం జారీ చేస్తున్నారు.

మహిళలను జంతువులకంటే హీనంగా చూసే వారి నైజంలో ఎలాంటి మార్పు ఉండబోదన్న సంకేతాలు వారు వ్యవహరిస్తున్న తీరుతో బయటపడుతున్నాయి. మహిళల హక్కులను కాలరాసే కఠినమైన షరియా చట్టాలను అమలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. దీంట్లో భాగంగా తమ దేశంలోని సెక్స్ వర్కర్ల లిస్టును తాలిబన్లు సిద్ధం చేస్తున్నారు. షరియా చట్టాల మేరకు సెక్స్ వర్కర్లకు బహిరంగ మరణశిక్ష విధించే యోచనలో తాలిబన్లు ఉన్నారని తెలుస్తోంది. అయితే ఇది నిబంధనను పురుషులకు గానీ లేదా తమకు అంటే తాలిబన్లకు గానీ వర్తింపజేసుకోరు. కేవలం మహిళలకు మాత్రమే శిక్ష. అలాకాకుంటే..వారిని లైంగిక వెట్టిచాకిరీలుగా వాడుకోవాలన్న యోచనలో తాలిబన్లు ఉన్నట్లు తెలుస్తోంది.

అడల్ట్ సైట్స్‌ సహాయంతో అఫ్గాన్ లోని సెక్స్ వర్కర్లను గుర్తిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశీయులతో శృంగారంలో పాల్గొన్న ఆఫ్గన్ మహిళలను గుర్తించి, వారికి మరణశిక్ష వేయాలని తాలిబన్లు భావిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. అఫ్గాన్ లో వేశ్యలుగా ఉన్న మహిళలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని కూడా వారు చేపట్టారు.

1996 నుంచి 2001 వరకు ఆఫ్గనిస్థాన్‌లో అధికారంలో ఉన్న తాలిబన్లు.. పలువురు సెక్స్ వర్కర్లకు బహిరంగ ప్రదేశాల్లో మరణశిక్ష అమలు చేశారు. ఇప్పుడు అధికారాన్ని చేపట్టనున్న తాలిబన్లు మళ్లీ అదే చేయనున్నారు. తాలిబన్ల పాలనలో సెక్క్ వర్కర్ల ప్రాణాలకు ముప్పు ఉందని ఇప్పటికే అంతర్జాతీయ మీడియా వర్గాలు ఆందోళన వ్యక్తంచేశాయి. చేస్తున్నాయి.

ఆఫ్గన్‌లో అధికారాన్ని కోల్పోయినా… గత 20 ఏళ్లుగా తాలిబన్లు మహిళలకు వ్యతిరేకంగా తమ అఘాయిత్యాలు కొనసాగించారు. ఇతర పరుషులతో అక్రమ సంబంధం పెట్టుకోవడం లేదా వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళలను తాలిబన్లు అత్యంత కిరాతకంగా హతమార్చారు. కానీ సెక్స్ వర్కర్లతో సంబంధాలు పెట్టుకున్న పురుషులను మాత్రం వారు ఏమీ చేయరు. తాలిబన్ల అవసరాలకు సెక్స్ వర్కర్లను వాడుకుంటారు. కానీ వారికి మాత్రం ఎటువంటి నిబంధనలు వర్తించవు. అంటే వారి దృష్టిలో మహిళలు అంటే కట్టుబానిసనలు..వారి లైంగిక అవసరాలు తీర్చే యంత్రాలు మాత్రమే. కాగా..ఆఫ్ఘనిస్థాన్‌లో వేశ్య వృతి నిషేధం. కానీ దేశంలో కరువు దేశం . దీంతో చేయటానికి ఏపనీ దొరకకు కొంతమంది మహిళలు ఇలా ఈ వృత్తిలోకి దిగుతున్నారు. పిల్లలను పోషించుకోవటానికి..కుటుంబం కోసం.