Sheep jailed for 3 years: మహిళను చంపిన గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు..!

ఒక మహిళను చంపిన గొర్రెకు కోర్టు మూడు సంవత్సరాల జైలుశిక్ష విధించింది.

Sheep jailed for 3 years: మహిళను చంపిన గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు..!

Sheep Jailed For 3 Years

Sheep jailed for 3 years : ఆఫ్రికాలో ఒక మహిళను చంపిన గొర్రెకు కోర్టు మూడు సంవత్సరాల జైలుశిక్ష విధించింది. దక్షిణ సూడాన్ లోని 45 ఏళ్ల అదీయు చాపింగ్‌ అనే మహిళకు ఓ పొట్టేలు పరిగెత్తించి..పరిగెత్తించి మరీ కుమ్మి కుమ్మి పడేసి మరో చంపింది. అదీయును పరిగెత్తించిన సదరు పొట్టేలు.. ఆమెను కిందపడేసి పదే పదే కొమ్ములతో కుమ్మింది. దీంతో మహిళ అపస్మాకర స్థితిలోనికి వెళ్లిపోయింది.ఆ తరువాత ప్రాణాలు కోల్పోయింది.

ఆఫ్రికాలోని సౌత్ సుడాన్ లోని మాన్యాంగ్ ధాల్ లో అకుల్ యోల్ ప్రాంతంలో.. ఆదియు చాంపింగ్ అనే 45 ఏళ్ల మహిళపై..ఓ పొట్టేలు దాడిచేసింది. మహిళను కిందపడేసి పదే పదే కొమ్ములతో అదేపనిగా కుమ్మేసింది. దీంతో మహిళ అపస్మారక స్థితిలోనికి వెళ్లిపోయింది. ఆమెను వెంటనే స్థానికులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్లు ఆమె పక్కటెముకలు విరిగిపోయాయని..అప్పటికే చనిపోయిందని దృవీకరించారు. దీంతో మృతురాలి తరపు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సదరు గొర్రె .. రామ్ అనే వ్యక్తిది. మరణించిన మహిళ.. వీరికి సమీప బంధువుకూడా. ఈ క్రమంలో పోలీసులు పొట్టెలును, దాని యజమాని రామ్ ను అదుపులోకి తీసుకున్నారు. పొట్టేలుతోపాటు దాని యజమానిని కూడా కోర్టులో హాజరుపరిచారు. ఈ వింత ఘటనను విచారించిన కోర్టు..మహిళ మరణానికి కారణమైన గొర్రెకు మూడేళ్ల పాటు జైలు శిక్షను విధించారు. అదే విధంగా, గొర్రె యజమానిని నిర్దోషి అని తేల్చింది.

అలాగే మరణించిన మహిళ కుటుంబానికి..ఐదు ఆవులను పరిహరంగా ఇవ్వాలని గొర్రె యజమానికి కోర్టు ఆదేశించింది. గొర్రెకు శిక్ష కాలంలో, గొర్రె సౌత్ సుడాలన్ లోని లేక్ స్టేట్ లోని ఆడ్యూల్ కౌంటి సైనిక శిబిరంలో గొర్రె మూడేళ్ల పాటు ఉంటుందని తీర్పు వెలువరించింది. సౌత్ సుడాన్ చట్టాల ప్రకారం.. మూడేళ్లు శిక్ష పూర్తయ్యాక.. గొర్రె బాధిత కుటుంబానికి చెందుతుందని కోర్టు తెలిపింది. ఈ వింత తీర్పు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.