Africa : ఆఫ్రికాలో ప్రాణం తీస్తున్న మిస్టరీ వ్యాధి .. ముక్కు నుంచి రక్తస్రావంతో 24 గంటల్లో ముగ్గురు మృతి

ఆఫ్రికాలో మిస్టరీ వ్యాధి కలకలం రేపుతోంది. ముక్కు నుంచి రక్తస్రావంతో 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు.దీంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. క్వారంటైన్ విధించిందిజ

Africa : ఆఫ్రికాలో ప్రాణం తీస్తున్న మిస్టరీ వ్యాధి .. ముక్కు నుంచి రక్తస్రావంతో 24 గంటల్లో ముగ్గురు మృతి

mysterious nosebleed kills 3 In Africa

Africa : ఇప్పటికే మరోసారి విరుచుకుపడుతున్న కోవిడ్ మహమ్మారితో ప్రపంచం మరోసారి అప్రమత్తమైంది. మాస్కులు మరోసారి మస్ట్ గా మారిన క్రమంలో ఆఫ్రికాలో తలెత్తిన మిస్టరీ వ్యాధి కలవరపరుస్తోంది. ఆఫ్రికాలో దేశమైన బురుండీలో తాజాగా ఓ మిస్టరీ వైరస్ కలకలం రేపుతోంది. ఈ వ్యాధి సోకినవారికి ముక్కు వెంట రక్తం కారుతోంది. ఇప్పటికే ఈ వ్యాధి సోకి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బురుండీలోని బెజీరో అనే టౌన్ లో వెలుగులోకి వచ్చిన ఈ వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. ఈ వింత వ్యాధి బారిన పడినవారిలో జ్వరం, తలనొప్పి, వాంతులు, మైకం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. ముక్కు వెంట రక్తస్రావం అవుతోందని బెజీరో ప్రాంతంలో ఈ వింత వ్యాధిన పడివారు ముగ్గురు మృతి చెందారని తెలిపారు.

ఈ వింత వ్యాధిని నియంత్రించటానికి చర్యలు చేపట్టిన అధికారులు బెజీరో ప్రాంతంలో క్వారంటైన్ విధించారు. ఈ వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరినవారిలో ముక్కు వెంట రక్తస్రావం జరిగి 24 గంటల్లో ముగ్గురు చనిపోయారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గత ఫిబ్రవరిలో బురుండీకి పొరుగున్న ఉన్న టాన్జానియా దేశంలో మార్గ్ బర్గ్ వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇది పక్క దేశాలకు కూడా వ్యాపించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కానీ మా దేశంలో వెలుగులోకి వచ్చిన వైరస్ మార్ బర్గ్ గానీ..ఎబోలా కాదని బురుండీ దేశ వైద్యశాఖ అధికారులు స్పష్టంచేశారు. కానీ ఈ ముక్కు వెంట రక్తం స్రావం అవయి ప్రాణాలు తీసే ఈ వింత వ్యాధి ఏంటో తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు.