Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే

చైనా అంశంపై చర్చించేందుకు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను నేపాల్ ఆర్మీ కూడా ధృవీకరించింది. కాగా గడిచిన 20 ఏళ్లలో నేపాల్‌ ప్రధాని అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి.

Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే

Nepal

Nepal – USA ties: భారత్ – చైనాల మధ్య భౌగోళికంగా ఎంతో కీలకంగా మారిన నేపాల్..ఇప్పుడు ప్రపంచ రాజకీయలకు వేదికగా మారనుంది. చైనా దురాక్రమణను నియంత్రించేందుకు అమెరికా వంటి దేశాలు నేపాల్ కు మద్దతు ఇస్తున్నాయి. ఈక్రమంలో చైనా అంశంపై చర్చించేందుకు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా అమెరికాలో పర్యటించనున్నారు. నేపాల్‌లో పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని అంతం చేయడానికి, అమెరికా చాలా రోజులుగా నిశ్శబ్ద దౌత్య వ్యూహంతో పనిచేస్తోంది. నేపాల్, అమెరికా అత్యున్నత స్థాయిలో చర్చలు జరపబోతున్నాయి. నేపాల్ ఆర్మీ చీఫ్ ప్రభురామ్ శర్మ జూన్‌లో అమెరికా వెళ్లనుండగా, జులైలో ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవుబా అమెరికా పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనను నేపాల్ ఆర్మీ కూడా ధృవీకరించింది. కాగా గడిచిన 20 ఏళ్లలో నేపాల్‌ ప్రధాని అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి. నేపాల్ ఆర్మీ అధికారి ప్రభురామ్ శర్మ జూన్ 27న అమెరికా సైనిక కార్యాలయం పెంటగాన్‌ను సందర్శిస్తారు.

other stories: Hanuman Jayanti 2022 : మే 29న ధ‌ర్మ‌గిరిలో సంపూర్ణ‌ సుంద‌ర‌కాండ అఖండ‌ పారాయ‌ణం

ఈసందర్భంగా నేపాల్ కు అవసరమైన సైనిక పరికరాలను అమెరికా అందించే విషయమై ఇరుదేశాల సైన్యాధికారులు చర్చించనున్నారు. కాగా ‘ఖాట్మండు పోస్ట్’ కధనం ప్రకారం, ఇటీవలి రోజుల్లో అమెరికా మరియు నేపాల్ మధ్య అనేక స్థాయిలలో చర్చలు జరుగుతున్నాయి. ఇందులో రాజకీయ మరియు సైనిక చర్చలు కూడా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఇండో-పసిఫిక్ ప్రాంతానికి చెందిన అమెరికా కమాండర్ అడ్మిరల్ జాన్ అక్విలినో నేపాల్ లో పర్యటించారు. గత వారం అమెరికా అండర్ సెక్రటరీ ఉజ్రా జయ సహా ముగ్గురు ఉన్నతాధికారులు రహస్యంగా నేపాల్‌లో పర్యటించారు.

other stories: ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్

అయితే జాన్ అక్విలినో నేపాల్ పర్యటనను అమెరికా అధికారులు ధ్రువీకరించలేదు. జాన్ అక్విలినో అమెరికా తరుపున నేపాల్ సహా మరో 36 దేశాలలో కార్యకలాపాలకు హెడ్ గా పనిచేస్తున్నారు. చైనాను అడ్డుకునేందుకు అమెరికా చాలా వేగంగా పావులు కదుపుతోంది. ఈక్రమంలో ఈ రెండు పెద్ద దేశాలకు నేపాల్ యుద్ధభూమిగా మారుతుందని నేపాల్‌లోని భద్రతా నిపుణులు భావిస్తున్నారు. కాగా 2017లో అమెరికా నేపాల్‌కు 500 మిలియన్ డాలర్ల ఆర్ధిక సహాయం ఇచ్చింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నేపాల్ మా వ్యూహాత్మక భాగస్వామిగా 2018లో అమెరికా ప్రకటించింది.