Mumbai : 80 ఏళ్లు పోరాడి ఆస్తి దక్కించుకున్న 93 ఏళ్ల మహిళ .. న్యాయపోరాటానికి వరించిన విజయం

ఆమె వయస్సు 93 ఏళ్లు. ముంబైలో తన ప్లాట్ కోసం కోర్టులో 10 కాదు 20 కాదు ఏకంగా 80 ఏళ్లు న్యాయపోరాటం చేసింది. ఆమె పోరాటానికి న్యాయం దొరికింది. ఆమె ఆస్తి ఆమెకు దక్కింది.

Mumbai :  80 ఏళ్లు పోరాడి ఆస్తి దక్కించుకున్న 93 ఏళ్ల మహిళ .. న్యాయపోరాటానికి వరించిన విజయం

Mumbai Ruby Mansion Flats

Mumbai : ఆమె వయస్సు 93 ఏళ్లు. ముంబైలో తన ప్లాట్ కోసం కోర్టులో 10 కాదు 20 కాదు ఏకంగా 80 ఏళ్లు న్యాయపోరాటం చేసింది. ఆమె పోరాటానికి న్యాయం దొరికింది. ఆమె ఆస్తి ఆమెకు దక్కింది. 80 ఏళ్ల పోరాటం అంటే మాటలు కాదు. బాంబే హైకోర్టు విచారించిన ఈ కేసులో ఆస్తి వివాదానికి ఎట్టకేలకు ముగింపు పలికింది.ఆస్తిని యజమాని అయిన 93 ఏళ్ల మహిళకు అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

సుదీర్ఘకాలం కొనసాగిన ఈకేసు వివరాల్లోకి వెళితే..ఈ పోరాటం దక్షిణ ముంబైలోని రూబీ మాన్షన్ లోని మొదటి అంతస్తులో ఉన్న 500, 600 రెండు ఫ్లాట్లకు సంబంధించింది. మార్చి 28, 1942నాటిది. అప్పుడు భారతదేశం బ్రిటీష్ పాలకుల చేతిలో ఉంది. అప్పటి బ్రిటీష్ పాలకుల డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం ప్రైవేటు ఆస్తులను బ్రిటీష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. అయితే జూలై 1946లో డీ-రిక్విజిషన్ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్లాట్ లను యజమాని అలిస్ డిసౌజాకు తిరిగి అప్పగించలేదు.

Delhi High Court : అమ్మపోరాటాన్ని గెలిపించిన కోర్టు, బాలుడి పాస్‌పోర్టులో తండ్రి పేరు తొలగించాలని తీర్పు

దీంతో ఆమె తన ఆస్తి తనకు అప్పంగించాలని కోరుతు మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై కలెక్టర్ కు ఆదేశించాలని కోరుతు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ భవనంలోనే ఇతర ఆస్తులను వారి వారి యజమానులకు అప్పగించారని కానీ తన ఆస్తులు మాత్రం తనకు అప్పగించలేదని పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ ఆస్తులు ప్రస్తుతం మాజీ ప్రభుత్వ అధికారి చట్టపరమైన వారసులచే ఆక్రమణలో ఉన్నాయి. 8 వారాల్లో ఆస్తిని స్వాధీనం చేసుకుని శాంతియుతంగా పిటిషనర్ డిజౌజాకు అప్పగించాలని న్యాయమూర్తులు ఆర్‌డి ధనుక, ఎంఎం సతయేలతో కూడిన డివిజన్ బెంచ్ మే 4 (2023)న తీర్పును వెల్లడించింది.