అమెరికన్లను భయపెడుతున్న మరో భయంకరమైన పురుగు

  • Published By: venkaiahnaidu ,Published On : May 6, 2020 / 10:54 AM IST
అమెరికన్లను భయపెడుతున్న మరో భయంకరమైన పురుగు

ఇప్పటికే కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తూ,అధిక సంఖ్యలో మరణాలతో అమెరికా ఆగమైపోతున్నఈ సమయంలో ఓ కీటకం ఇప్పుడు అమెరికన్ల గుండెళ్ల రైళ్లు పరుగెత్తిస్తోంది. ‘మర్డర్ హార్నెట్’ గా పిలువడే వెస్పా మండరీనియా అనే కీటకం ఇప్పుడు అమెరికా వాసులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఆగ్నేయ ఆసియాలో, ముఖ్యంగా చైనా, తైవాన్లలో ఎక్కువగా ఉంటే ప్రమాదకరమైన ఈ కీటకాలను కెనడా సరిహద్దుకు దగ్గర్లోని వాషింగ్టన్ రాష్ట్రంలోని బ్లేన్ లో ఓ వ్యక్తి గుర్తించాడు.

కెనడా సరిహద్దు ప్రాంతాల్లో కనిపించిన ఈ పురుగు… మనుషులకు, తేనెటీగల పెంపకందారులకు ప్రమాదమేనని అమెరికా అధికారులు అంటున్నారు. అసలు ఇవి అమెరికాకు ఎలా చేరుకున్నాయో అమెరికా అధికారులకు అర్థం కావట్లేదు. ఓడల నుంచి అది వచ్చి ఉంటుందని ఓ అంచనా. ఏషియన్ జయంట్ హార్నెట్ అని కూడా పిలిచే వెస్పా మండరీనియా… 2.5 అంగుళాల వరకు పెరుగుతుంది.

అది కరిస్తే విషం ఎక్కుతుంది. ఎన్నిసార్లు కరిస్తే అంత ఎక్కువ విషం విడుదల అవుతుంది. ఒకటి రెండు సార్లు అయితే పుండుపడి తగ్గుతుంది. అంతకంటే ఎక్కువైతే విషం ఎక్కువ అవుతుంది. అంతకుమించి ఎక్కువైతే ప్రాణాంతకం కూడా కావచ్చని వాఫింగ్టన్ స్టేట్ అగ్రికల్చర్ డిపార్మెంట్ మేనేజింగ్ ఎంటోమాలజిస్ట్ స్వెన్-ఎరిక్ స్పిచిగర్ తెలిపారు.  వ్యవసాయానికి కూడా హార్నెట్ నుంచి ముప్పు ఉంటుందని, ముఖ్యంగా తేనెటీగల పెంపకంపై హార్నెట్ ప్రభావం ఉంటుందని యూఎస్ సైంటిస్టులు చెబుతున్నారు.

కొన్నిగంటల్లో అవి తేనెతుట్టెలను నాశనం చేస్తాయని సైంటిస్టులు తెలిపారు. హార్నెట్స్.. తేనెటీగల తలలు విరిచి చంపేస్తాయి. తర్వాత తుట్టెల్లో తమ గుడ్లను పెడతాయి. తేనెటీగల లర్వాలు లేదా పిల్లలను తమ పిల్లలకు భోజనంగా వేస్తాయి. తేనెటీగల కొరకు ధరించే దుస్తులతో వీటి తుట్టెల దగ్గరకు వెళ్లొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  వీటి కొండి 65 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. ఇంత ప్రమాదకరమైన హార్నెట్ పురుగులు ఇప్పటిదాకా రెండు చోట్ల కనిపించినట్టు వార్తలు అందాయి. కానీ ఇంకా నిర్ధారణలు అవసరమని అమెరికా వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. హార్నెట్ లు సాధారణంగా ముషులనుగానీ,పెట్ లను కానీ ఎటాక్ చేయవని,కానీ వాటిని భయపెడితే మాత్రం ఖచ్చితంగా దాటి చేస్తాయని తెలిపారు.

అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించిన ఓ కథనం ప్రకారం…ఏటా ఈ మర్డర్ హార్నెట్ లు కరవడం వల్ల 50మంది మనుషులు చనిపోయే అవకాశముందని అంచనా. ఈ పురుగు గట్టిగా అగ్గిపెట్టె సైజులో ఉండి,ముదురు పసుపు-ఆరెంజ్ రంగులో ఉన్న తలతో…నలుపు-పసుపు రంగు కలిసిన శరీరంతో ఉంటుంది. వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం… వెస్పా మాండరినియా ప్రపంచంలో ఉన్న హార్నెట్ జాతుల్లో వెస్పా మాండరినియా అనేది అతిపెద్దది. కెనడా కూడా 2019లో బ్రిటీష్ కొలంబొయా ఫ్రావిన్స్ లోని రెండు లొకేషన్లలో ఈ పురుగును గుర్తించినట్లు తెలిపారు.

Also Read | కారు డ్రైవ్ చేస్తున్న 5ఏళ్ల బుడ్డోడు…పోలీసులు షాక్