రష్యా రెండో కరోనా వ్యాక్సిన్ రెడీ

  • Published By: venkaiahnaidu ,Published On : October 9, 2020 / 08:28 PM IST
రష్యా రెండో కరోనా వ్యాక్సిన్ రెడీ

Russia’s second coronavirus vaccine: ప్రపంచంలోనే తొలిసారిగా ఆగస్టు నెలలో స్పుత్నిక్ వీ పేరుతో కరోనా వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి విడుదల చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చిన రష్యా..ఇప్పుడు మరో కరోనా వ్యాక్సిన్ ను సిద్దం చేసింది. అక్టోబర్-15న రష్యా ..తన రెండో కరోనా వ్యాక్సిన్ “ఎపివాక్” రిజిస్టర్ చేయనుంది. ఈ కొత్త కరోనా వ్యాక్సిన్ ను వెక్టార్ స్టేట్ రీసెర్ట్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీ డెవలప్ చేసింది.



ఇటీవలే ఈ వ్యాక్సిన్ ప్రారంభదశ క్లినికల్ ట్రియిల్స్ పూర్తయ్యాయి. రెండవ దశ హ్యూమన్ ట్రయిల్స్ నవంబర్-డిసెంబర్ మధ్యలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 30వేల మంది వాలంటీర్లు పాల్గొనబోతున్నట్లు సమాచారం. హ్యూమన్ ట్రయిల్స్ నిర్వహించేందుకు జులై నెలలోనే వెక్టార్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ కు రష్యా ఆరోగ్యమంత్రిత్వశాఖ అనుమతిచ్చింది. గత నెలలో ట్రయిల్స్ లో పాల్గొన్న దాదాపు 20మంది వాలంటీర్లు డిశ్చార్జ్ అయ్యారు.



క్లినికల్ ట్రయిల్స్ పై రష్యా చీఫ్ శానిటరీ డాక్టర్ అన్నా పొపొవా మాట్లాడుతూ…హ్యూమన్ ట్రయిల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్లలో ఏ ఒక్కరికీ అనారోగ్యసమస్యలు తలెత్తలేదు. జ్వరం లేదా ఇతర ఏ అనారోగ్య సమస్యలు వారికి కలుగలేదని తెలిపారు.