Fire Employees: ట్విట్టర్, మెటా బాటలో డిస్నీ.. ఉద్యోగుల్ని తొలగించేందుకు నిర్ణయం

మొన్న ట్విట్టర్.. నిన్న మెటా... ఇప్పుడు డిస్నీ.. వరుసగా టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్లు డిస్నీ సంస్థ చెప్పింది. అమెజాన్ కూడా ఇదే బాటలో పయనించబోతుంది.

Fire Employees: ట్విట్టర్, మెటా బాటలో డిస్నీ.. ఉద్యోగుల్ని తొలగించేందుకు నిర్ణయం

Fire Employees: ‘టెక్’ కంపెనీల్లో ఉద్యోగాల తొలగింపు కొనసాగుతోంది. ఇటీవలే ట్విట్టర్, మెటా సంస్థలు ఉద్యోగుల్ని భారీ సంఖ్యలో తొలగించగా, ఇప్పుడు మరో టెక్ సంస్థ డిస్నీ కూడా ఇదే బాటలో నడవబోతుంది. డిస్నీలో ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్లు సంస్థ సీఈవో బాబ్ చెపాక్ వెల్లడించారు.

Pawan Kalyan: ఓట్లు రాకపోయినా నామినేషన్లు వేస్తాం.. యువత చెడిపోతుందనే ఒక్క యాడ్ కూడా చేయలేదు: పవన్ కల్యాణ్

ఖర్చులు తగ్గించుకునేందుకు పలు సంస్థలు ఇటీవలి కాలంలో భారీగా ఉద్యోగుల్ని తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ సంస్థ దాదాపు సగం మంది ఉద్యోగుల్ని తీసేసింది. మెటా కూడా దాదాపు 11,000 మందిని తొలగించింది. ప్రస్తుతం డిస్నీ సంస్థ కూడా ఆదాయం తగ్గడంతో ఉద్యోగుల కోతపై దృష్టిపెట్టింది. దీనిలో భాగంగా ఇప్పటికే ఉద్యోగుల నియామక ప్రక్రియను నిలిపివేసింది. అత్యవసర విభాగాల్లో మాత్రమే సిబ్బందిని తీసుకుంటోంది. దీనికి సంబంధించిన ప్రత్యేక విశ్లేషణ కొనసాగుతోంది. ఇప్పటికే పని చేస్తున్న సిబ్బంది విషయంలో అనేక అంశాల్లో రివ్యూ చేస్తున్నారు.

Pawan Kalyan: జగనన్న కాలనీ ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారు.. కాలనీలకు కనీసం రోడ్లు కూడా వేయలేదు: పవన్ కల్యాణ్

దాని ఆధారంగా ఉద్యోగుల తొలగింపుపై నిర్ణయం తీసుకోబోతుంది డిస్నీ. ఇప్పటికే ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 190,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఎంతమందిని తొలగిస్తారో ఇంకా స్పష్టత లేదు. మరోవైపు డిస్నీతోపాటు అమెజాన్ కూడా భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించబోతుంది.