Cook Chicken Slap : అరచేయితో కైమా కొట్టి చికెన్ వండేశారు..

చికెన్ కట్ చేయాలంటే పదునైనా కత్తి అవసరం.. కానీ, ఓ యూట్యూబర్ ఏళ్లపాటు ప్రయత్నించి.. ఎలాంటి ఆయుధం అవసరం లేకుండా చేతులతోనే కైమా కొట్టి చికెన్ వండేశాడు.

Cook Chicken Slap : అరచేయితో కైమా కొట్టి చికెన్ వండేశారు..

Cook Chicken Slap

Cook Chicken By Slapping : చికెన్ కట్ చేయాలంటే పదునైనా కత్తి అవసరం.. కానీ, ఓ యూట్యూబర్ ఏళ్లపాటు ప్రయత్నించి.. ఎలాంటి ఆయుధం అవసరం లేకుండా చేతులతోనే కైమా కొట్టి చికెన్ వండేశాడు. చివరికి అనుకున్నది సాధించి చూపాడు. భౌతిక శాస్త్రంలోని గతిశాస్త్రాన్ని థర్మల్ ఎనర్జీలోకి మార్చడం ద్వారా చికెన్ చేతులతో కొట్టి వండేశారు.

ఇంతకీ ఇందులో ఏ ఫార్మూలా వాడారంటే.. కైనటిక్ ఎనర్జీని థర్మల్ ఎనర్జీ ఫార్మూలా (1/2mv2=mcT) వాడారు. ప్రతి మనిషి చేయి బరువు 4కిలోలు ఉంటుంది. ఒక చేత్తో కొట్టే వేగం 11 m/s (25mph)ఉంటుంది. కిలో బరువైన చికెన్ రోస్ట్ చేయాలంటే 2720J/kg*c హీటింగ్ కెపాసటీ అవసరం ఉంటుంది. అదే చికెన్ కుకింగ్ చేయాలంటే 205C (400F) వద్ద ఉడికించాల్సి ఉంటుంది. కానీ, యూట్యూబర్ మాత్రం కేవలం ఒక చేతిదెబ్బతో చికెన్ కుక్ చేశాడు.

చికెన్ కైమా కొట్టేందుకు తన చేతిని 1665.65 m/s వేగంతో పూర్తి చేశాడు. సాధారణంగా భూమి గంటకు 1600 కిలోమీటర్లు (1000మైళ్లు) తిరుగుతుంటుంది. చికెన్‌ను 3725.95 mph కైమా కొట్టడం ద్వారా కుక్ చేసుకోవచ్చు. చికెన్ ను 1mph వేగంతో 3726 సార్లు కొట్టడం ద్వారా గ్రేవీ చేయడం అంత ఈజీ కాదంటున్నారు. ఒక్కో దెబ్బ సగటున ఉత్పత్తి అయ్యే ఉష్ణోగ్రత 0.0089 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. చికెన్ కుక్ చేయడానికి సగటున 23,034 సార్లు కొట్టాలంట. కానీ, యూట్యూబర్ చేతులతో పాటు మిషనరీని కూడా ఉపయోగించి ప్రయత్నించాడు.


తక్కువ ఉష్ణోగ్రత వద్ద చికెన్ కుక్ చేయాలనుకున్నాడు. 135000 సార్లు అరచేతితో చరిచాడు.. ఇందుకు అతడికి 8 గంటల సమయం పట్టింది. ఏదైనా ఒక వస్తువును నిర్దిష్ట ఎత్తు నుంచి కిందికి వదిలినప్పుడు.. పొటెన్షియల్ ఎనర్జీ కాస్తా కైనటిక్ ఎనర్జీగా మారుతుంది. అప్పుడు గతిశక్తి వేడిగా మారుతుంది. ఎత్తును మార్చడం ద్వారా కూడా వేగాన్ని పెంచుకోవచ్చు. అలాగే హీట్ కూడా పెరుగుతుంది. టర్కీ కోడితో ఆరు గంటల్లో 72సార్లు ప్రయత్నించారు. చివరికి ప్రయోగంలో విజయం సాధించారు.