Air India రెడీ.. మే 4 తర్వాతకు టిక్కెట్ బుకింగ్స్

Air India రెడీ.. మే 4 తర్వాతకు టిక్కెట్ బుకింగ్స్

Air India శనివారం కీలక ప్రకటన చేసింది. దేశీయ ప్రయాణాలతో పాటు విదేశీ ప్రయాణాలకు మే 4నుంచి టిక్కెట్ బుకింగ్స్ చేసుకోవచ్చని తెలిపింది. ‘ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సర్వీసులు ఆపేశాం. ప్రస్తుతం మే3 తర్వాత నుంచి దేశీ సర్వీసులకు టిక్కెట్లు బుకింగ్స్ ఓపెన్ చేశాం. విదేశీ ప్రయాణాలు మే31 తర్వాత నుంచి పునరుద్ధరిస్తాం. 

సెలక్ట్ చేసిన రూట్లకు మాత్రమే బుకింగ్స్ అవుతాయి. ఇంటర్నేషనల్ విమానాలు కూడా జూన్1 నుంచి బుక్ చేసుకోవచ్చు’ అని అధికారులు చెబుతున్నారు. మార్చి 25 నుంచి భారత్ లో లాక్ డౌన్ విధించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని చేసిన ప్రక్రియలో మొదటగా విమాన సర్వీసులనే ఆపేశారు. ముందుగా ఏప్రిల్ 14వరకూ నిర్దేశించిన లాక్‌డౌన్‌ను ప్రధాని మోడీ మే3వరకూ పొడిగించారు. 

ఈ సమయంలో జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఏప్రిల్ 3న బుకింగ్స్ ఆపేయాలని నెలాఖరు వరకూ అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ బుకింగ్స్ చేసుకోవద్దని పిలుపునిచ్చింది.