ప్లాస్టిక్ కవర్లు చుట్టేసుకుని : కరోనా భయంతో పాపం..విమానంలో ప్రయాణీకుల అవస్థలు చూడండీ..

  • Edited By: veegamteam , February 24, 2020 / 05:09 AM IST
ప్లాస్టిక్ కవర్లు చుట్టేసుకుని : కరోనా భయంతో పాపం..విమానంలో ప్రయాణీకుల అవస్థలు చూడండీ..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా గడగడలాడించేస్తోంది. దాని పేరు చెబితేనే ప్రజలు వణికిపోతున్నారు. మాస్క్ లేకుండా గడపదాటే ధైర్యం చేయటంలేదు. దీంతో కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఏం చేసేందుకైనా ప్రజలు వెనకాడట్లేదు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా విమానంలో ఇద్దరు ప్రయాణికుల కరోనా బారిన పడకుండా ఉండేందుకు తీసుకున్న జాగ్రత్తల తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇద్దరు ప్రయాణీకులు ప్లాస్టిక్ కవర్లతో మొఖంతో పాటు మొత్తం బాడీ అంతా ప్యాక్ చేసేసుకున్నారు. దాంతో వారు కాస్త ఇబ్బంది పడుతున్నా..కవర్లు తీయటానికి మాత్రం ధైర్యం చేయట్లేదు. వారి ముందు కూర్చున్న ఓ ప్రయాణికుడు దీన్ని తనక ఫోర్ తో షూట్ చేసి ట్విటర్‌లో షేర్ చేశాడు. ‘వీరిద్దరూ ప్రస్తుతం నా వెనక సీట్లోనే ఉన్నారు. కరోనా అంటే వీపరీతంగా భయపడితే ఇదిగో ఇలా జరుగుతుంది’ అంటూ కామెంట్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘కరోనా మజాకానా..కరోనాకు ఎవ్వరైనా భయపడాల్సిందే’అంటూంటే..ఇంకొందరు ‘వారి పరిస్థితిని మేము అర్థం చేసుకోగలం‘ అంటూ కామెంట్స్ పడుతున్నారు.  ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

కాగా..కరోనా సోకకుండా ఉండేందుకు ఫలానా జాగ్రత్త పాటిస్తే వైరస్ సోకదని ఎవరు అన్నాసరే దాన్ని ఫాలో అయిపోతున్నారు ప్రజలు. అటువంటి విషయం తెలిస్తే చాలు మరో ఆలోచన లేకుండా అది ఫాలో అయిపోతున్నారు. మరి కరోనా అంతగా భయపెట్టేస్తోంది. ఏం చేస్తారు పాపం..ఎవరి జాగ్రత్తలు వారివి.