viral pic : ఆ బండరాళ్లు ఎందుకలా ఉన్నాయ్?! అంత కరెక్ట్ గా కట్ చేసింది గ్రహాంతరవాసులేనా..?!

ఓ కొండపై రెండు పెద్ద పెద్ద బండరాళ్ల మధ్యలో చన్నటి కట్టింగ్.. ఎవరో ఆ రాయిని చాకచక్యంగా కట్ చేశారా? అన్నట్లుగా ఉన్న ఆ బండరాళ్లు వైరల్ గా మారాయి.

viral pic : ఆ బండరాళ్లు ఎందుకలా ఉన్నాయ్?! అంత కరెక్ట్ గా కట్ చేసింది గ్రహాంతరవాసులేనా..?!

Al Naslaa Rock Formation

Al Naslaa Rock Formation: రాతి కొండలమీద ఉండే పెద్ద పెద్ద బండరాళ్లను చూస్తే కాస్త చిత్రంగా అనిపిస్తుంటుంది. ఓ చోట ఓ పేద్ద బండరాయిమీద ఎవరో పెట్టినట్లు ఓ చిన్న బండ ఉంటుంది. మరోచో రెండు బండరాళ్ల మధ్యలో కావాలనే ఎవరో అమర్చినట్లుగా ఓ వింత షేపులో కొన్ని బండరాళ్లు ఉంటాయి. మరోచోట ఇంకాస్త చిత్రంగా చక్కటి బ్యాలెన్స్ తో చిన్న బండరాయిమీద పేద్ద బండరాయి ఉంటుంది. అటువంటివి మనం చాలానే చూసి ఉంటాం. అలా ఉన్నవాటిని చూస్తే..ఎవరోపెట్టినట్లే ఉన్నాయే..భలే చిత్రంగా అని అనుకుంటుంటాం. కానీ ఇటీవల రెండు పెద్ద పెద్ద బండరాళ్లు..సోషల్ మీడియాలో పిచ్చ పిచ్చగా వైరల్ అవుతున్నాయి. దానికి కారాణం ఆ బండరాళ్లు ఉన్నతీరు.

Read more : Spittoon Pouch : వావ్.. ఉమ్మితే మొక్కలు పెరుగుతాయ్.. ఖర్చు తగ్గించుకునేందుకు ఇండియన్ రైల్వేస్ ఐడియా

ఓ కొండపై రెండు పెద్ద పెద్ద బండరాళ్ల మధ్యలో చన్నటి కట్టింగ్ ఎవరో వాటిని చాలా చాకచక్యంగా కట్ చేశారా? అన్నట్లుగా ఉన్నాయవి. రెండు పెద్ద పెద్ద బండరాళ్ల మధ్యలో చీలిన ఆ రాయి అలా కట్‌ చేయడం మనుషుల వల్ల కూడా ఖచ్చితంగా అవుతుందని చెప్పలేం. అందుకే ఆ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.‘‘ఆ పేద్ద బండరాయిని ఎవరు అలా కట్ చేశారబ్బా’’ అంటూ నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు.ఎవరు చేసి ఉంటారు అంటూ బుగ్గన వేలు పెట్టుకుని కొంతమంది ఆశ్చర్యపోతుంటే మరికొందరు ‘‘లేదు లేదు ఆ పెద్ద బండరాయిని గ్రహాంతరవాసులే అలా కట్ చేసి ఉంటారు’’ అని అంటున్నారు.

వివరాల్లోకి వెళితే.. 30 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు కలిగిన ఈ బాహుబలి బండరాయిని సౌదీ అరేబియాలోని తైమా ఒయాసిస్‌లో ఉంది. ఈ ఫోటోని చూసిన నెటిజన్లు మాత్రం ఆ రాయి అలా ఉండడానికి కారణంగా పలు సిద్ధాంతాల పేర్లను చెప్పేస్తున్నారు ఎవరికి తోచినట్లుగా వారు. ఆ బండ‌రాయిని గ్ర‌హాంత‌ర‌వాసులే అలా చీల్చి ఉంటార‌ని కొందరు నెటిజ‌న్లు చెబుతున్నారు. వేరే గ్ర‌హం నుంచి లేజ‌ర్ పాయింట‌ర్ ద్వారా దాన్ని చీల్చి ఉంటారు అని మ‌రికొం‍దరు కామెంట్ చేశారు.

Read more : Varada vinayak : వరద వినాయకుడి దేవాలయంలో 130 ఏళ్లుగా వెలుగుతున్న అఖండద్వీపం..

ఇలా దీనిపై రకరకాల ఊహాగాలు వస్తున్న క్రమంలో బ్రిస్టల్ విశ్వవిద్యాలయంలో లూయిస్ అనే ఓ పరిశోధకుడు ఈ రాయి వెనుక రహస్యం గురించి పరిశోధనా శైలిలో క్లారిటీ ఇచ్చారు.’ఆ బండరాయి అలా స‌మానంగా చీలిపోవ‌డానికి కార‌ణం.. ఫ్రీజ్ థా వెథ‌రింగ్‌ ఎఫెక్ట్ అని స్ప‌ష్టం చేశారు. నీళ్లు ఆ బండ‌రాయి మీదకు చేరి.. దానికి ప‌గుళ్లు ఏర్ప‌డ‌టంతో అలా స‌మానంగా చీలిపోయే అవ‌కాశం ఉంటుంద‌ని.. దాన్నే ఫ్రీజ్ థా వెథ‌రింగ్ ఎఫెక్ట్ అంటార‌ని స్ప‌ష్టం చేశారు. అయితే బండ‌రాయి ఆ రకంగా స‌గానికి చీలే ప్రక్రియకు కొన్ని వేల సంవ‌త్సరాలు పట్టే అవకాశం ఉందని తెలిపారు.

కానీ విష‌యాన్ని కొంతమంది నమ్మారు.కానీ అందరు నమ్మరు కదా..ఎవరికి తోచించి వాళ్లు అనుకుంటున్నారు.కానీ జనాలు కదా ఎవరికి తోచింది వారు అనుకుంటుంటారు. కానీ ‘ నేను ఎలా ఉంటే మీకెందుకు..మీపని మీరుచూసుకోండీ అన్నట్లుగా‘ ఆ రాయిమాత్రం నిశ్చలంగా అలాగే ఉంది.