Wrongly Convicted in Rape case : రేప్ కేసులో 16 ఏళ్ల జైలుశిక్ష తర్వాత నిర్దోషని తేలటంతో క్షమాపణ చెప్పిన ప్రముఖ రచయిత్రి

అత్యాచారం కేసులో ఓ నిర్ధోషిని దోషిగా తేల్చి శిక్ష విధిచింది కోర్టు. 16 ఏళ్లు శిక్ష అనుభవించాక అతను దోషి కాదు నిర్ధోషి అని తేలింది. దీంతో రచయిత్రి క్షమాపణ చెప్పింది.

Wrongly Convicted in Rape case : రేప్ కేసులో 16 ఏళ్ల జైలుశిక్ష తర్వాత నిర్దోషని తేలటంతో క్షమాపణ చెప్పిన ప్రముఖ రచయిత్రి

Wrongly Convicted In Rape Case

Wrongly Convicted in Rape case : 100 మంది దోషులు తప్పించుకున్న గానీ..ఒక్క నిర్ధోషికి కూడా శిక్ష పడకూడదు అనేది మన భారత శిక్షాస్మృతి చెబుతోంది. అందుకేనేమో..భారత్ లో జరిగిన అత్యాచారం కేసులు దశాబ్దాల తరబడి విచారణలు జరుగుతునే ఉంటాయి. అన్ని సాక్ష్యాధారాలు పక్కాగా ఉండాలి. నిందితుడు నేరస్థుడిగా నిర్ధారణ జరగాలి. అప్పుడే శిక్ష విధించాలి. లేకుంటే నిందితుడు దోషి కాదు నిర్ధోషి అని తేలితే అతను శిక్ష అనుభవించిన కాలాన్ని ఎవ్వరు తెచ్చివ్వలేరు. నేరస్థుడు అని ముద్ర పడిన అతని భవిష్యత్తు అంధకారమైపోతుంది. అని కుటుంబంపై కూడా ఆ ప్రభావం పడుతుంది. ఇలా పలు కేసుల విషయంలో జరిగాయి.

దోషిగా నిర్ధారించబడి శిక్ష అనుభవించాక కొన్ని కేసుల్లో అతను నిర్ధోషి అని నిరూపణ అయిన దాఖలాలు ఉన్నాయి. అదే జరిగిందో ఓ వ్యక్తి విషయంలో. అత్యాచారం కేసులో దోషిగా తేల్చి 16 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాక అతను దోషి కాదు నిర్ధోషి అని తేలింది. అప్పటికే అతని జీవితంలో విలువైన 16 ఏళ్లు జైల్లోనే శిక్ష అనుభవించారు. తరువాత నిర్ధోషి అని తేలింది. కానీ ఏం లాభం..దీంతో అత్యాచార బాధితురాలు బాధ పడింది. కుమిలిపోయింది. చేసేదేమీ లేక అతనికి క్షమాపణ చెప్పిన ఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో వెలుగు చూసింది.

Read more : 20ఏళ్లు జైలుశిక్ష అనుభవించాక నిర్ధోషని తేల్చిన కోర్టు ! నా జీవితాన్ని తెచ్చివ్వగలరా?బాధితుడి ఆవేదన

అత్యధికంగా అమ్ముడైన “లక్కీ”,”ది లవ్లీ బోన్స్”నవల రచయిత్రి అలైస్ సెబాల్డ్ యుక్తవయసులో ఉండగా అంటే 1982లో అత్యాచారానికి గురైంది. సిరక్యూస్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు Anthony Broadwater అనే వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ‘లక్కీ’ అనే పుస్తకంలో రాసింది. ఈ కేసు విచారణలో ఆంథనీ బ్రాడ్‌వాటర్‌ అనే వ్యక్తిని నిందితుడిగా భావించారు పోలీసులు. లైస్ కూడా అతన్నే దోషిగా గుర్తించింది. దీంతో అతనికి 16 ఏళ్ల జైలు శిక్ష విధించారు. 1982 సమయంలో ఈ కేసు సంబంధించిన విచారణలో తీవ్రమైన లోపాలు చోటు చేసుకున్నాయని ఆంథోని బ్రాడ్‌వాటర్‌ను కోర్టు నిర్దోషిగా తేల్చింది.

ఈ కేసుపై ఒనోండగా కౌంటీ జిల్లా అటార్నీ విలియం ఫిట్జ్‌పాట్రిక్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి గోర్డాన్ కఫీ ఈ కేసుపై విచారణ చేపట్టింది. నేరారోపణతో జైలు శిక్ష అనుభవిస్తున్న బ్రాడ్‌వాటర్ అప్పటి కోర్టు ప్రాసిక్యూషన్‌లో అన్యాయం జరిగిందని రుజువైంది. ఈ సమయంలో 61 ఏళ్ల ఆంథోని బ్రాడ్‌వాటర్‌ కన్నీరు పెట్టుకున్నారు.మీడియాతో మాట్లాడుతూ.. తాను గత రెండు రోజులుగా ఆనందంగా ఉపశమనంతో ఉన్నానని తెలిపారు. ఈ కేసును తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్నానని..అత్యాచారం చేసిన దోషిగా ముద్ర పడ్డ నేను కుమిలిపోయానని ఆవేదన వ్యక్తంచేశాడు.

Read more : TDP : క్షమాపణలు చెప్పడానికి ఇంత సమయం పట్టిందా ?

1981లో తనపై అత్యాచారం జరిగిందని, కొన్ని నెలలకు అత్యాచారం జగిగిన వీధిలో ఓ నల్లజాతి వ్యక్తి అయిన బ్రాడ్‌వాటర్‌ కనిపించడంతో.. అతనే తనపై అత్యాచారం చేసినట్లు ఆరోపిస్తూ అలిస్ సెబోల్డ్‌ తన పుస్తకం ‘లక్కీ’లో రాసింది. తర్వాత బ్రాడ్‌వాటర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే 16 ఏళ్ల పాటు చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించిన బ్రాడ్‌వాటర్‌పై నేరారోపణలు రుజువు కాలేదు. ఆయనపై ఉన్న అత్యాచారం కేసును కోర్టు కొట్టివేసింది.

ఆంథనీని దోషిగా తేల్చే బలమైన ఆధారాలేవీ దొరకలేదని తేలింది. కేవలం అలైస్ మాటలు.. ప్రస్తుతం అమల్లో లేని వెంట్రుకల మైక్రోస్కోపిక్ విశ్లేషణ ఆధారంగానే ఆంథనీని ముద్దాయిగా తేల్చారని కోర్టు అభిప్రాయపడింది. దీంతో అతన్ని నిర్దోషిగా ప్రకటించింది.

Read more : Rare coin Rs 2.6 crore : రూ.2.6 కోట్లు పలికిన 16వ శతాబ్దం నాటి నాణెం..

దీంతో ఆంథనీకి క్షమాపణలు చెప్తూ అలైస్ ఒక లేఖ రాసింది. ఆ సమయంలో తాను పొరపడ్డానని, అమెరికా న్యాయవ్యవస్థపై నమ్మకముంచానని పేర్కొంది. అలాగే తన కారణంగా ఆంథనీ చాలా జీవితం కోల్పోయినందుకు చాలా కుమిలిపోతున్నానని తెలిపింది. అయితే ఆమె ఎదుర్కొన్న అనుభవాన్ని తాను అర్థం చేసుకోగలనని..కానీ నా విలువైన జీవితాన్ని ఓ నేరస్థుడిగా జైల్లో గడిపానని వాపోయారు.