ఏలియన్లు మనుషులతో కమ్యూనికేట్ అవ్వాలనుకోవడానికి రీజన్ ఇదే

ఏలియన్లు మనుషులతో కమ్యూనికేట్ అవ్వాలనుకోవడానికి రీజన్ ఇదే

Aliens: నాసా లాంటి అనేక స్పేస్ ఏజెన్సీలు భూమికి వెలుపల ఎవరున్నారనే దానిపై అనేక పరిశోధనలు జరిపాయి. రేడియో సిగ్నల్స్ పంపించి.. జీవి మనుగడ ఉందని… భూ ప్రపంచాన్ని పరిచయం చేయడానికి తహతహలాడుతున్నారు. అలాగే ఏలియన్లు కూడా మనుషులతో కాంటాక్ట్ అవడానికి ప్రయత్నిస్తారని దానికి కారణం కూడా చెప్తున్నారు ఓ ఆస్ట్రోఫిజికిస్ట్.

మనుషులు.. ఏలియన్లను కలవాలని ఎంతగా ప్రయత్నిస్తున్నారో.. ఏలియన్లు ఉన్నాయని నమ్మి చేస్తున్న ప్రయత్నాల మాదిరిగా అటువైపు నుంచి కూడా అలాగే ప్రయత్నిస్తుండొచ్చని అంటున్నారు జాకో వాన్ లూన్. కీలే అబ్జర్వేటరీ డైరక్టర్ దానికి కారణాలు కూడా చెప్తున్నారు.

భారీ కాస్మోస్ లో ఉండి మనుగడ సాగించే ఏలియన్లు చాలా అడ్వాన్స్ డ్ గా ఉండొచ్చని మనుషులు భూమి మీద ఉండే సంకేతాలు అందే ఉంటాయని అంటున్నారు.

ఏలియన్లు అసలు ఉన్నాయా అనే అనుమానం చాలా మందికి ఉంది. ఎందుకంటే మనం వాటిని ఇప్పటిదాకా కనుగొనలేదు. అవి ఉన్నాయనడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. భూమి మీద మనం ఏర్పడిన పరిస్థితులను బట్టే మరో గ్రహంపైనా.. జీవరాశులు ఉండటం సహజమే. మనమెంతైతే కుతుహూలంగా వాటికోసం వెదుకుతున్నామో అవి కూడా అదేలా ప్రయత్నిస్తాయి.

వాటితో కమ్యూనికేట్ అవడానికి మరో కారణం కూడా ఉంది. సహజం మనం ఇతరుల సహాయం తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. అవి కూడా అలా సాయం, స్నేహం కోసం ట్రై చేసి ఉండొచ్చు. ఉంటుండొచ్చని ఆయన అంటున్నారు.

జీవి మనుగడకు అనుకూలమైన భూమిపై ఉండేందుకు ఏలియన్లు చాలా ఇంట్రస్టింగ్ గా ఉండొచ్చు. అవి ఉంటున్న గ్రహం నాశనమయ్యే సమయంలోనే అవి భూమి మీదకు వస్తాయేమో అనే ఆశను వ్యక్తపరుస్తున్నారు.