అమెరికా చరిత్రలోనే ఫస్ట్ టైం : అగ్రరాజ్యంలో మొత్తం 50 విపత్తు రాష్ట్రాలను ప్రకటించిన ట్రంప్

  • Published By: sreehari ,Published On : April 13, 2020 / 03:03 AM IST
అమెరికా చరిత్రలోనే ఫస్ట్ టైం : అగ్రరాజ్యంలో మొత్తం 50 విపత్తు రాష్ట్రాలను ప్రకటించిన ట్రంప్

కరోనా వైరస్ కోరల్లో అగ్రరాజ్యం అమెరికా అల్లడిపోతోంది. రోజురోజుకీ వేల సంఖ్యలో పాజిటీవ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో అమెరికాలోని ప్రధాన భూభాగాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. చైనాలో పుట్టిన కరోనా వైరస్ అమెరికా సహా ఇటలీ, స్పెయిన్ దేశాలను అతులాకుతలం చేసేసింది. కరోనా దెబ్బకు అగ్రరాజ్యంలో కరోనా సోకినవారంతా పిట్టల్లా రాలిపోతున్నారు. 

ఇటలీని అధిగమించిన అమెరికా :
మొన్నటివరకూ అత్యధిక కరోనా మరణాల్లో ముందున్న ఇటలీని అధిగమించి అమెరికా అత్యధిక మరణాలు సంభవించిన దేశంగా అవతరించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో వ్యోమింగ్ ప్రకటనను అధ్యక్షుడు ట్రంప్ శనివారం ఆమోదించారు. అనంతరం అమెరికా చరిత్రలోనే మొదటిసారిగా మొత్తం 50 రాష్ట్రాలను పెద్ద విపత్తు రాష్ట్రాలుగా ట్రంప్ ప్రకటించారు.

22 రోజుల్లో, ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (FEMA) ద్వారా ట్రంప్ మొత్తం 50 రాష్ట్రాలు, చాలా భూభాగాల్లో ప్రధాన అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. తుది విపత్తు ప్రకటన అదే రోజున అమెరికా ఇటలీని అధిగమించి వైరస్ కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన దేశంగా అవతరించింది.

పెద్ద విపత్తు రాష్ట్రంగా న్యూయార్క్ :
మార్చి 20న న్యూయార్క్‌లో కరోనావైరస్ బాధిత మొట్టమొదటి పెద్ద విపత్తు రాష్ట్రంగా ట్రంప్ ఆమోదించారు. రెండు రోజుల తరువాత వాషింగ్టన్, కాలిఫోర్నియా, వైరస్ ప్రారంభ హాట్ స్పాట్‌లను ప్రకటించారు. న్యూయార్క్ అత్యంత కష్టతరమైన రాష్ట్రంగా మారింది. అమెరికాలో ఇప్పటివరకూ 188,694 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వైరస్ బారిన పడి 9,385 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

యుఎస్ వర్జిన్ ఐలాండ్స్, నార్తర్న్ మరియానా ఐలాండ్స్, వాషింగ్టన్, డిసి, గువామ్, ప్యూర్టో రికోలు ఆమోదించిన ప్రధాన విపత్తు ప్రకటనలను అందుకున్నాయి. విపత్తు హోదాను అందుకోని ఏకైక US భూభాగం అమెరికన్ Samoa ప్రాంతం ఒక్కటే.. ట్రంప్ ఆదివారం ట్వీట్‌లో ఈ ప్రకటనలతో ప్రశంసించారు.

అదృశ్య శత్రువుపై యుద్ధంలో గెలుస్తాం:
‘చరిత్రలో మొట్టమొదటిసారిగా మొత్తం 50 రాష్ట్రాలకు Presidential Disaster Declaration పూర్తిగా సంతకం చేయడం జరిగింది. అదృశ్య శత్రువుపై యుద్ధంలో గెలిచాము.. గెలుస్తాం కూడా’ అని ట్వీట్ చేశారు. FEMA డిక్లరేషన్ వైరస్ వ్యాప్తిపై పోరాడటానికి రాష్ట్రాలకు ఫెడరల్ నిధులను అందుబాటులో ఉంచుతుంది. మహమ్మారి మధ్య రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు తగినంత వైద్య పరికరాలను పొందటానికి ప్రయత్నిస్తున్నాయి. 

Johns Hopkins University గణాంకాల ప్రకారం.. ప్రపంచంలో అత్యధికంగా 547,681 మంది జనాభా ఉన్నారు. ఇప్పటివరకూ కరోనా సోకి కనీసం 21,686 మంది మరణించారు. ఇటలీలో కనీసం 19,899 మృతిచెందారు. ప్రపంచవ్యాప్తంగా 1.8 మిలియన్లకు పైగా పాజిటీవ్ కేసులు నమోదు కాగా, కనీసం 113,362 మరణాలకు దారితీసింది.(వీడిని ఏం చేయాలి, డాక్టర్ పై ఉమ్మేసిన కరోనా పేషెంట్, హత్యాయత్నం కేసు నమోదు)