Haj 2021: హజ్ వెళ్లేందుకు చేసిన అప్లికేషన్లన్నీ క్యాన్సిల్

హజ్ తీర్థ యాత్ర వెళ్లేందుకు పెట్టుకున్న అప్లికేషన్నింటినీ హజ్ కమిటీ క్యాన్సిల్ చేసినట్లు మంగళవారం వెల్లడించింది. సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కేంద్రం ఈ స్టేట్మెంట్ ఇచ్చింది.

Haj 2021: హజ్ వెళ్లేందుకు చేసిన అప్లికేషన్లన్నీ క్యాన్సిల్

Haz Applications

Haj 2021: హజ్ తీర్థ యాత్ర వెళ్లేందుకు పెట్టుకున్న అప్లికేషన్నింటినీ హజ్ కమిటీ క్యాన్సిల్ చేసినట్లు మంగళవారం వెల్లడించింది. సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కేంద్రం ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. దీనిపై హజ్ కమిటీ ఆఫ్ ఇండియా అధికారిక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది.

హజ్ & ఉమ్రా మంత్రిత్వ శాఖ, సౌదీ అరేభియా ప్రభుత్వం.. కరోనా వైరస్ కారణాల వల్ల తమ స్వదేశీయులే హజ్ కు రావాలని, విదేశఈయులకు అనుమతి లేదని చెప్పింది. అదీ కాకుండా కేవలం 1442మందిని మాత్రమే రావాలని చెప్పింది. అంతర్జాతీయ హజ్‌ ఈ ఏడాది రద్దు చేశారు. అని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా చెప్తూ.. అప్లికేషన్లన్నింటినీ క్యాన్సిల్ చేసినట్లు వెల్లడించింది.

గత వారం సౌదీ అరేబియా ప్రభుత్వం స్వదేశస్థులే హజ్ యాత్రకు రావాలని ప్రకటించింది. 60వేల మంది వ్యక్తులకు మాత్రమే ఎంట్రీ ఉంటుందని చెప్పింది. మరోసారి చర్చలు జరిపిన హజ్ అండ్ ఉమ్రా మంత్రిత్వ శాఖ.. ఆ సంఖ్యను కుదించింది. పదేళ్లలో దాదాపు 150మిలియన్ మంది హజ్ యాత్రకు వెళ్లారు.