Silver For Lakshya Sen : ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్.. సిల్వర్‌తో సరిపెట్టుకున్న లక్ష్యసేన్

ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ రన్నరప్‌గా నిలిచాడు. సిల్వర్ తో సరిపెట్టుకున్నాడు.

Silver For Lakshya Sen : ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్.. సిల్వర్‌తో సరిపెట్టుకున్న లక్ష్యసేన్

Silver For Lakshya Sen

Silver For Lakshya Sen : ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్ కు స్వర్ణం చేజారింది. భారత యువ స్టార్ షట్లర్‌ లక్ష్యసేన్‌ రన్నరప్‌గా నిలిచాడు. సిల్వర్ తో సరిపెట్టుకున్నాడు. మెన్స్ సింగిల్స్‌ ఫైనల్‌లో వరల్డ్ నెంబర్ 1 విక్టర్‌ అక్సెల్సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో వరుస గేముల్లో 21-10, 21-15 తేడాతో ఓటమి చెందాడు. ఇక సెమీస్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ లీ జియాను ఓడించి తొలిసారి లక్ష్యసేన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

తన కెరీర్ లోనే అతిపెద్ద టోర్నీ విజేతగా నిలిచి చరిత్ర సృష్టిద్దామని లక్ష్యసేన్‌ అనుకున్నాడు. కానీ, అతడి ఆశలు ఆవిరయ్యాయి. లక్ష్యసేన్.. ఇటీవలి కాలంలో సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్నాడు. ప్రతిష్ఠాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ ఛాంపియన్‌షిప్‌ లో తొలిసారి పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ చేరిన లక్ష్యసేన్‌.. విక్టర్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు. సెమీస్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ లీ జియాను ఓడించి బంగారు పతకంపై కన్నేసిన లక్ష్యసేన్‌.. ఏకపక్షంగా సాగిన ఫైనల్‌ పోరులో ఒత్తిడిని తట్టుకోలేక చేతులెత్తేశాడు.

Lakshya Sen : చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్.. ఆల్ ఇంగ్లండ్ టోర్నీ ఫైన‌ల్‌కు భారత యువ షట్లర్

ఆల్‌ ఇంగ్లండ్‌ మెన్స్ సింగిల్స్‌లో భారత షట్లర్ల విజయాలను చూస్తే.. 1980లో ప్రకాశ్‌ పదుకొనే, 2001లో పుల్లెల గోపీచంద్‌ టైటిళ్లు సాధించగా.. 1947లో ప్రకాశ్‌ నాథ్‌ రన్నరప్‌గా నిలిచాడు. మహిళల్లో సైనా నెహ్వాల్ (2015) మాత్రమే ఆల్‌ ఇంగ్లండ్‌ ఫైనల్‌ ఆడింది.

ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్‌షిప్ టోర్నమెంట్ లో భార‌త ఆట‌గాళ్లంతా నిరుత్సాహ ప‌ర‌చ‌గా.. ల‌క్ష్య‌సేన్ మాత్రం ఫైనల్ వరకు వెళ్లాడు. కాగా, ఫైన‌ల్ చేర‌డంతోనే ఓ రికార్డును సొంతం చేసుకున్నాడు ల‌క్ష్య‌సేన్. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్‌షిప్‌లో సింగిల్స్ విభాగంలో ఫైన‌ల్ చేరిన ఐదో భార‌త ఆటగాడిగా రికార్డుల‌కెక్కాడు. గతంలో ప్రకాశ్‌ నాథ్‌ (1947, రన్నరప్‌), ప్రకాశ్‌ పదుకొణె (1980-విజేత, 1981-రన్నరప్), పుల్లెల గోపీచంద్ (2001, విజేత), సైనా నెహ్వాల్ (2015, రన్నరప్‌) ఫైనల్‌కు చేరిన వారిలో ఉన్నారు.