శివరాత్రి స్పెషల్ : ఐర్లాండ్‌లో పురాతన శివయ్య సీక్రెట్

శివరాత్రి స్పెషల్ : ఐర్లాండ్‌లో పురాతన శివయ్య సీక్రెట్

Maha Shivratri  Ancient shiv ling in ireland : త్రిమూర్తులో శివయ్యకుండే ప్రత్యేకతే వేరు. రూపురేఖల్లోను..పూజల్లోను..భక్తులకు కోరికలు తీర్చే విషయంలోను శివయ్య తీరే వేరు. బోళాశంకరుడు. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే పరమశివుడు. ఎంత ఆగ్రహం ఉంటుందో అంతగా అనుగ్రహించటంలో బోళాశంకరుడిని మించినవారు లేరు. శివుడికి మన భారతదేశంలోనే కాదు చాలా దేశాల్లో గుడులు ఉన్నాయి. ఆ గుళ్లలో ఎన్నో రహస్యాలు..మరెన్నో మర్మాలు కొలువుదీరి ఉంటాయి. అటువంటి ఓ శివలింగం గురించి ఈ మహాశివరాత్రి పర్వదినాన తెలుసుకుందాం..ఐర్లాండ్‌లో అతి పురాతన శివలింగం గురించి..

ఐర్లాండ్‌లో ఉన్న ఈ శివలింగాన్ని ధ్వంసం చేయాలని ఎన్నిసార్లు యత్నించినా అది సాధ్యం కాలేదు అంటే ఆ శివయ్య మహత్యాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. 2012లో ఓ వ్యక్తి ఏకంగా 11 సార్లు దాడి చేసినా..2014లో కొందరు వ్యక్తులు శివలింగంపై పెయింట్ పోశారు. మరెన్నోసార్లు క్షుద్రపూజలు చేసిన ఘటనలు జరిగాయి. కానీ పరమరుద్రుడికి ఎటువంటి విధ్వంసం జరగలేదు.

ప్రపంచంలో అత్యంత రహస్యమైన శివలింగం ఐర్లాండ్‌లో ఈ పురాతన శివలింగం. మీత్ కౌంటిలోని తారా పర్వత ప్రాంతాల్లో కొలువైన ఈ శివలింగం వెనక ఎన్నో రహస్యాలు దాగున్నాయి. చుట్టూ రాతి ఇటుకలతో పొడవైన శిలగా ఉంటుందీ లింగం. భూమిలోంచి పొడుచుకొచ్చినట్లుగా కనిపిస్తుందీ శివలింగం..

వందల ఏళ్ల కింద దీన్ని గుర్తించారు. స్థానికులు ఈ శివలింగాన్ని ‘లియా ఫెల్’ అని పిలుస్తారు. అంటే స్థానిక భాషలో ‘అదృష్ట శిల’ అని అర్థం. ఈ శివలింగాన్ని ధ్వంసం చేయానికి గతంలో చాలా మంది ప్రయత్నించారు. కానీ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. ఒక్క పెచ్చుకూడా ఊడలేదు. ఈనాటికి ఈశివయ్య లింగం చెక్కుచెదరకుండా ఈనాటికీ అలాగే ఉంది.

లియా ఫెల్ లింగ చరిత్ర
అదృష్ట శిలగా చెప్పుకునే ఈ లియా ఫెల్ లింగానికి ఎంతో చరిత్రం ఉంది. ఇది ఈనాటిది కాదు..క్రీ.శ. 1632-1636 మధ్య కాలంలో ఫ్రెంచ్ సాధువులు రచించిన పురాతన గ్రంథం ”ది మైనర్స్ఆఫ్ ది ఫోర్ మాస్టర్స్”లో ఈ శివలింగానికి సంబంధించిన కొన్ని వివరాలు పొందుపరిచి ఉన్నాయట.

‘తుథాడి దేనన్’ వర్గానికి చెందిన ఓ నేత దీన్ని స్థాపించినట్లు ఆ పురానత గ్రంథంలో రాయబడి ఉంది. తుథాడి దేనన్ అంటే ‘దను’ దేవత పిల్లలు అని అర్థం. వీళ్లు క్రీ.పూ. 1897 నుంచి 1700 వరకు ఐర్లాండ్‌ని పాలించారు. క్రైస్తవ సన్యాసులు ఈ శివలింగాన్ని పునరుత్పతి సామర్థ్యానికి చిహ్నంగా భావించేవారట. అంతేకాదు ఎంతో మంది ఐరిష్ రాజుల పట్టాభిషేకాలు సైతం ఈ శివలింగం సాక్షిగా జరిగినట్లు చరిత్ర చెబుతోంది.

సంప్రదాయాల్లో నదీ దేవతగా కొలిచే దను దేవత..
యూరోపియన్ సంప్రదాయాల్లో దనను నదీ దేవతగా కొలుస్తారు. ఆమె పేరు మీదుగానే దేన్యూబ్, దోన్, డనీపర్, డినియెస్టర్ నదులకు పేర్లు వచ్చాయట. దును దేవత ప్రస్తావన మన భారతదేశపు వేద సంస్కృతిలో కూడా ఉంది. దను దేవత శివుడికి మామ అయిన దక్ష ప్రజాపతి కూతురు. ఆమెను దక్ష ప్రజాపతి కశ్యప మునీశ్వరుడికి ఇచ్చి వివాహం చేశాడు. దను దేవతను నదీ దేవతగా కొలుస్తారు. దను సోదరి సతీ దేవి. అంటే శివుడి భార్య. ఆమెనే పార్వతి అని ఉమ ఇలా ఎన్నో నామాలతో పిలుస్తారు. తండ్రిని కాదని సతీదేవి శివుడిని వివాహమాండింది.

ఆ తరువాత తండ్రి ఇంట జరిగిన దక్ష యజ్ఞంలో సతీదేవికి జరిగిన అవమానంలో తన బొటన వేలుని నేలపై రాసి అగ్నిని పుట్టింది ఆ అగ్నిలో దహనమైపోయింది సతీదేవి. ఆ తరువాత జన్మలో సతీదేవి పార్వతిగా అవతారమెత్తి శివుడిని వివాహం చేసుకుంది. వేద సంస్కృతిని విశ్వసించే వాళ్లు ఐర్లాండ్‌లోని లియా ఫైల్‌ని శివలింగంగా భావిస్తారు.

ఐర్లాండ్‌తో పాటు అతి పురాతన నగరాలైన పాల్మైరా (సిరియా), నిమ్రుద్ (ఇరాక్)లోనూ శివుడిని పూజించినట్లు ఆధారాలు ఉన్నాయి. అంతేకాదు శివయ్యను ప్రపంచ వ్యాప్తంగా పూజిస్తారు. పలు రకాల పేర్లతో పూజిస్తారు. ఆఖరికి భారత్ ను పరిపాలించిన బ్రిటీష్ దేశం అయిన స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గోలో కూడా శివుడి దేవాలయం ఉంది.అదే స్వర్ణ శివాలయం. అలాగే తుర్కిస్థాన్ సిటిలో 1200 అడుగుల శివలింగం ఉంది. అంతేకాదు హైడ్రోపొలిస్ నగరంలో 300 అడుగుల శివలింగంతో పాటు బ్రెజిల్ దేశ వ్యాప్తంగా ఎన్నో శివలింగాలున్నాయి.

అంతేకాదు యూరప్ లోని పలు దేశాల్లో శివాలయాలు ఉన్నాయి. అలాగే కంబోడియాలో ఓ పురాతన శివలింగం ఉంది.జావా, సుమత్రా దీవుల్లో కూడా పలు ప్రాంతాల్లో శివలింగాలు ఉన్నాయి. మన పక్కదేశాలైన నేపాల్, మన దాయాది దేశం అయిన పాకిస్తాన్ లోకూడా శివాలయాలున్నాయి. అలాగే ఈజిప్ట్ దేశాల్లో కూడా పలు ప్రాంతాల్లో శివలింగాలు కొలువుదీరి ఉన్నాయి. పురావస్తు ఆధారాల ప్రకారం మెసపొటేమియా, మొహంజదారో, హరప్పా కాలం నుంచే శివుడు పూజలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. పురాణాల ప్రకారం శివలింగాలు ఆరు రకాలుగా ఉంటాయి.