Mimicry Lyre bird : మిమిక్రీ చేసే అమేజింగ్ బర్డ్..కోడిలా ఉంటుంది..నెమలిలా పురి విప్పుతుంది..

Mimicry Lyre bird : మిమిక్రీ చేసే అమేజింగ్ బర్డ్..కోడిలా ఉంటుంది..నెమలిలా పురి విప్పుతుంది..

Mimicry Superb Lyre Bird

Mimicry Superb Lyre bird: వసంత కాలంలో ‘కుహూ..కుహూ అని కూసే కోకిల గానాలు మనస్సుని ఎంతగానో మైమరపిస్తాయి. వాటికి జతగా మనం కూడా కూ..కూ అని కూస్తే అవి మనకు మాటకు ప్రత్యుత్తరమిస్తాయి. అవికూడా కూ అంటూ కూస్తాయనే విషయం తెలిసిందే. కోకిలను పాటలు పాడే పక్షులని అంటాం. కానీ మిమిక్రీ చేసే పక్షి గురించి తెలుసా? అంటే ఏంటీ ఓ పక్షి మిమిక్రీ చేస్తుందా? అని ఆశ్చర్యమేస్తుంది. ఈ ప్రకృతిలో ఇటువంటి వింతలు విశేషాలు ఎన్నో ఉంటాయి. అవి మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యానికి గురిచేస్తునే ఉంటాయి. అటువంటి అమేజింగ్ పక్షి లైర్ బర్ద్ (Lyrebird).

1

 

3

ఈ లైర్ బర్డ్ అచ్చం మనిషిలానే రకరకాలుగా గొంతును మారుస్తూ..మిమిక్రీ చేస్తుంది. ఆస్ట్రేలియాలో లైర్ బర్ద్ గా పిలిచే ఈ పక్షులు ఆస్ట్రేలియాలో ఉంటాయి. నెమలి, కోడిలకు పుట్టినట్లుగా ఉంటుంది. బాడీ కోడిలాగా ఉంటే దాని తోక మాత్రం అచ్చం నెమలి తోకలాగా పొడవుగా ఉంటుంది. ఆ పొడవాటి తోకను నెమలిలాగానే పురి విప్పుతుంది కూడా. విచిత్రమైన కూతలతో అలరిస్తు ప్రకృతి ప్రేమికులను అలరిస్తుంటాయి.

6

8

ఈ పక్షి అరుపులు కాస్త వింతగా ఉంటాయి. చిన్నపిల్లలు అరుస్తున్నట్లుగా, చిన్న పిల్లలు ఏడుస్తున్నట్లుగా..ఉంటాయి. అంతేకాదు ఈ అమేజింగ్ బర్డ్ భలే వేషాలేస్తుంది. పక్షులపై పరిశోధనలు చేసేవారు. వాటి అరుపులపై పరిశోధనలకు చేసేవారి తమ కెమెరా ఫోటో ఈ పక్షిని ఫోటోలు తీద్దామనుకునే సమయంలో కెమెరా ‘క్లిక్’లాగా అవికూడా ‘క్లిక్’మని శబ్దాలు చేస్తుంటాయి.

5

4

అంతేకాదు ఈ పక్షులు ఎంత విచిత్రమైనవంటే..వీడియో గేమ్ ఆడుతున్న సమయంలో వచ్చే సౌండ్స్ ను కూడా గొంతు నుంచి వినిపిస్తాయి. అంటే మిమిక్రీ చేస్తాయన్నమాట. ఇలా అనేక రకాల శబ్దాలను చేస్తుండడంతో ఈ పక్షులను మిమిక్రీ పక్షులు అని కూడా ముద్దుగా పిలుస్తారు. ఇలా రకరకాల శబ్దాలు రావడానికి కారణం గొంతులోని ఉండే కొన్ని ఎముకల కారణంగా ఇవి ఇలాంటి శబ్దాలు చేస్తుంటాయని పరిశోధకులు తెలిపారు.