Dry Valley: 20 లక్షల ఏళ్లుగా వర్షాలు కరవని ప్రాంతం..అయినా గడ్డ కట్టించే చలి..

20 లక్షల ఏళ్లుగా వర్షాలు కరవని ప్రాంతం అది. అయినా గడ్డ కట్టించే చలి వణికిస్తుంది. లక్షల ఏళ్లుగా ఉన్న చెరువుల్లో నీరు కూడా ఓ వింతే. వర్షాలు,మంచు కురవని ప్రాంతంలో సరస్సులు ఓ వింతే.

Dry Valley: 20 లక్షల ఏళ్లుగా వర్షాలు కరవని ప్రాంతం..అయినా గడ్డ కట్టించే చలి..

Antarctica Mcmurdo Dry Valley

Antarctica Mcmurdo Dry Valley : అదొక వింత ప్రదేశం. అస్సలు వర్షాలే కురవని ప్రాంతం. అయినా చల్లగా ఉంటుంది. అంతేకాదు అతి శీతల ప్రదేశం కూడా. అక్కడ లక్షల ఏళ్ళుగా వర్షపు చినుకు జాడే లేదు. అది పూర్తిగా మంచుతో కప్పి ఉండే అంటార్కిటికా ఖండంలోని ‘కరువు’ ప్రాంతం..మంచు శిఖరాలు ఉంటాయి. కానీ ఒక్క వానచుక్క కూడా పడదు. అందుకే వీటిని ‘డ్రై వ్యాలీస్‌’ అంటారు.

అంటార్కిటికా ఖండంలో ఉత్తరం వైపు సముద్రతీరానికి సమీపంలో దాదాపు 4,800 చదరపు కిలోమీటర్ల మేర అత్యంత పొడిగా ఉండే ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ వాన చుక్క పడి లక్షల సంవత్సరాలు అయ్యింది. అందుకే వీటిని ‘డ్రై వ్యాలీస్‌’ అంటారు. ఈ కరవు వ్యాలీస్ లో దాదాపు 20 లక్షల ఏళ్లుగా వానచుక్క పడలేదు. శీతల ప్రాంతమైనా మంచు కురవలేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

Read more : Death Mystery: ఆ గ్రామంలో ఒకరు చనిపోతే.. వెంటనే మరొకరు చనిపోతున్నారట..!

ఇటువంటి పరిస్థితుల్లో ఈ డ్రై వేలీ ప్రాంతంలో చాలావరకు ఒక్క చుక్క నీళ్లుగానీ..మంచుగాలేకపోవటంతో అత్యంత పొడిగా ఉంటుంది. శీతల ప్రాంతం కాబట్టి వేడి ఉండదు. కానీ డ్రైగా ఉంటుంది. సంవత్సరమంతా మైనస్‌ 14 నుంచి మైనస్‌ 30 డిగ్రీల సెంటిగ్రేడ్‌ మధ్య గడ్డ కట్టించే చలి ఉంటుంది. ప్రకృతి వింతల్లో ఇదొకటిగా చెప్పుకోవచ్చు.ఎందుకంటే గడ్డకట్టే చలిలో కూడా మంచుగానీ..వర్షం గానీ పడకపోవటం అంటే వింత అనే చెప్పాలి.

ఎటు చూసినా మంచు కొండలు ఉండే ఈ ఖండంలో ఇలా పొడి ప్రదేశాలు ఉండటానికి కారణం ‘కాటబాటిక్‌ విండ్స్‌’గా పిలిచే గాలులే కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ డ్రైవ్యాలీస్‌ ప్రాంతానికి చుట్టూ ‘ట్రాన్స్‌ అట్లాంటిక్‌’గా పిలిచే పర్వతాలు ఉన్నాయి. డ్రైవ్యాలీస్‌ వైపు వీచే గాలులను ఈ పర్వతాలు బాగా పైకి ఎగిసేలా చేస్తాయి. ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉండటంతో ఆ గాలుల్లోని తేమ అంతా మంచుగా మారి పర్వతాలపై పడుతుంది. వర్షం గానీ మంచుగానీ కరవని ఈ వింత ప్రాంతంలో కొన్ని సరస్సులు కూడా ఉన్నాయి.

Read more : Deaths Banned : ఇక్కడ మరణాలు నిషేధం..70 ఏళ్లుగా ఒక్కరు కూడా మరణించని ప్రదేశం

ఈ సరస్సులు కూడా విచిత్రమైనవే. ఎందుకంటే ఈ సరస్సులు ఏర్పడి లక్షల ఏళ్లు అయ్యింది. అప్పటినీరే ఇప్పటికీ ఉండటం ఎంత వింతో. ఈ నీరు ఆవిరి అవ్వటానికి అక్కడ వేడి వాతావరణం ఉండదు కాబట్టి ఆవిరి అయ్యే అవకాశం లేదు. లక్షల ఏళ్ల కింద ఏర్పడ్డ ఆ సరస్సుల్లో అప్పటి నీరే ఉడటం..వర్షాలు..హిమపాతం లేకపోవడంతో కొత్తగా నీళ్లు చేరే అవకాశం లేదు. అందుకే ఆనాటి నీరే ఈ నాటికి ఉన్నా లక్షల ఏళ్లుగా నీరు కాస్తంత అంటే చాలా చాలా తక్కువగా నీరు ఆవిరి అవుతూ వస్తోంది.

లక్షల ఏళ్లుగా వేసవికాలంలో చాలా చాలా తక్కువగా నీరు ఆవిరవుతూ వస్తుండటంతో ఈ సరస్సుల్లోని నీటిలో లవణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సరస్సుల్లో నీరు సముద్రపు నీటికన్నా మూడు రెట్లు ఉప్పగా ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

అంటార్కిటికా మంచు నీటిలో భారీ సంఖ్యలో జీవించే సీల్స్ జంతువులు ఇక్కడికి వస్తుంటాయి. అలా వచ్చినవి ఇక్కడి వాతావరణ తట్టుకోలేక చనిపోతుంటాయి. ఇది శీతల ప్రాంతం కాబట్టి అలా చనిపోయిన వాటి కళేబరాలు ఏమాత్రం పాడవ్వకుండా వందలు, వేల ఏళ్లపాటు ఉండిపోతాయి. అచ్చు ‘మమ్మీ’ల్లాగన్నమాట.

Read more :

చిలీ, పెరూ దేశాల మధ్య ఇటువంటి మరో ప్రదేశం కూడా ఉంది. దాని పేరు అటకామా ఎడారి. ఈ ఎడారిలో ఎన్నో వందల ఏళ్లుగా ఒక్క చుక్క వాన కూడా పడదు. ఒకవేళ పడినా సంవత్సరానికి ఒకటి మహా అయితే రెండు మిల్లీమీటర్ల కంటే తక్కువే పడుతుందట.