1Tree 40 Different Fruits : 40 రకాల పండ్లు కాస్తున్న చెట్టు..!

ఒక్క చెట్టు రెండురకాల కూరగాయలు కాస్తోందని తెలిసి ఆశ్చర్యపోయాం. కానీ ఒకే చెట్టు ఏకంగా 40 రకాలు పండ్లుకాస్తోంది. పండ్లు కాయటంలోనే కాదు కళ్లు తిప్పుకోలేని అందం ఈ చెట్టు ప్రత్యేకత..

1Tree 40 Different Fruits : 40 రకాల పండ్లు కాస్తున్న చెట్టు..!

One Tree Can Produce 40 Different Kinds Of Fruits (2)

one Tree Can Produce 40 Different Kinds Of Fruits: ఒకే మొక్కకు టమాటాలు,వంకాయలు కాయించి ఔరా అనిపించారు భారత వ్యవసాయ పరిశోధకులు. కానీ ఒకే చెట్టు రెండు కాదు మూడు కాదు పోనీ నాలుగు కూడా కాదు ఏకంగా 40 రకాల పండ్లు కాస్తే..నిజమని అస్సలు నమ్మం. సరికదా..జోక్ అనుకుంటాం. కానీ మనిషి తలచుకుంటే అది ఏదైనా చేసి చూపిస్తాడని పెరుగుతున్న టెక్నాలజీని బట్టి..వినూత్న పంటల విధానాన్ని చూస్తే నమ్మాల్సిందే.మామిడి పండ్లు తినాలంటే వేసవి రావాల్సిందే. సీతాఫలాలు తినాలంటే వర్షాకాలం రావాల్సిందే. అలాగే రేగి పండ్లు, నేరేడు పండ్లు తినాలంటే ఆయా సీజన్లకోసం ఎదురు చూడాల్సిందే. కానీ అలాకాకుండా 40 రకాల పండ్లు ఒకే చెట్టుకు కాస్తే అదికూడా అన్ని కాలాల్లో కాస్తే! ఊహ చాలా అత్యద్భుతంగా ఉంది. కానీ అది ఊహ కాదు నిజమని నిరూపించాడు సామ్ వాన్ అకెన్ అనే వ్యక్తి. ఇది నిజంగా అద్భుతమే. అద్భుతమే కాదు అత్యంత అత్యద్భుతమనే చెప్పాలి. అది సామ్ వాన్ అద్భుత సృష్టి.

Read more : Plant : ఒకే మొక్కకు వంకాయ, టమాటాలు

పెన్సిల్వేనియాలోని రీడింగ్‌ సిటీకి చెందిన సామ్ వాన్ అకెన్ అనే వ్యక్తి వినూత్న పంటలు పండింటంలో ఆరితేరారు. సామ్ వాన్ అకెన్ సిరక్యూస్ యూనివర్శిటీలో ప్రొఫెసర్. జన్యుపరంగా ఒకేరకమైన మొక్కలను అంటుకట్టడం ద్వారా ఒకే చెట్టుకు ఏకంగా 40 రకాల కాయల్ని కాయిస్తున్నారు. విత్తనాలు ఉండే పండ్ల మొక్కలను జన్యుపరంగా అంటుకట్టడం ద్వారా ఈ చెట్టును సృష్టించారు సామ్ వాన్. ఈది ఒక రకమైన సైన్స్‌ ఎక్పరిమెంట్‌ అని చెప్పక తప్పదు.

అలాగే ఈ చెట్లు పండ్లు కాయాలంటే చాలా త్వరగానే కాపుకొస్తాయట. కేవలం నెలల్లోనే ఈ చెట్టు రేగు, పీచెస్‌, ఆప్రికాట్‌ పండ్లు, నేరేడు పండు, బాదం.. ఇలా 40 రకాల పండ్లు కేవలం మూడేళ్లకే కాయడం మొదలు పెడుతుందట. ఈ ప్రక్రియ మొత్తాన్ని శామ్‌ వాన్‌ అకెన్‌ మాత్రం దీనిని ఆర్ట్‌ వర్క్‌ అనుకుంటానని చెబుతున్నారు.ఈ అత్యద్భుతమైన చెట్టు గురించి శామ్ వాన్ మాట్లాడుతు..40 రకాల పండ్ల చెట్టును సృష్టించడానికి వివిధ రకాల విత్తన పండ్ల మొక్కలను కనుగొన్నానని..ఈ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు పారిశ్రామికీకరణ, ఏకీకృత సంస్కృతి వల్ల ఆహార ఉత్పత్తిలో వైవిధ్యాన్ని గుర్తించానని తెలిపారు. అలాగే వ్యాపార పరంగా..తక్కువ లాభదాయంగా ఉండే అనేక పండ్ల జాతులు ఏడాదికి ఏడాది కనుమరుగవుతున్నాయనే విషయం కనుగొన్నాను. రైతులు, పండ్ల తోటలు పెంచే వారినుంచి సేకరించిన మొక్కల ఆధారంగా 40 పండ్ల చెట్లను సృష్టించానని అకెన్ చెప్పుకొచ్చాడు.

Read more :Selling Human skulls,Bones :రండి బాబూ రండీ..మనుషుల పుర్రెలు, ఎముకలు కొనుక్కోండీ..నెట్టింట్లో ఎముకల వ్యాపారం

ఇది నమ్మటానికి..ఇది నమ్మకపోయినా ఈ రోజుల్లో ఏదైనా సాధ్యమనని నిరూపించారు శామ్ వాన్. అమెరికాలోని అర్కన్‌సాస్, కెంటుకీ, మైనే, మసాచుసెట్స్, న్యూజెర్సీ, న్యూయార్క్, పెన్సిల్వేనియాలో వాన్ అకెన్ చెట్లను చూడవచ్చు. ఆనందించ వచ్చు. అబ్బుర పడవచ్చు కూడా. అంతేకాకుండా వివిధ రకాల పండ్ల చెట్లను పెంచడం, సాగు చేయడం, శుభ్రపరచడం వంటివి టైమ్ వేస్టు..స్థలం కూడా వృధా అవుతుందంటున్నారు శామ్ వాన్. నిజమేమరి. సీజన్ కాని సీజన్ లో ఓ పండో తినాలంటే దొరకవాయే.కానీ ఇటువంటి చెట్ల వల్ల సీజన్ కాకపోయినా ఆ పండ్లు తినొచ్చు.పైగా కోరిన పండ్లన్నీ ఒకే చెట్టుకి కాస్తే..నిజంగా ఇటువంటి అత్యద్భుతమైన ఆలోచన చేసిన శామ్ వాన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.