Amazon-Raksha Bandhan : ‘బహుమతులు డబ్బాల్లో రావు’ అమెజాన్ హార్ట్ టచ్చింగ్ రక్షాబంధన్ వీడియో

 అక్కా-తమ్ముడు, అన్నాచెల్లి అనుబంధాలను చాటి చెప్పే రక్షాబంధన్ వేడుక సందర్భంగా ఎన్నో ఆఫర్లు ప్రకటించిన అమెజాన్ హార్ట్ టచ్చింగ్ వీడియోను విడుదల చేసింది..

Amazon-Raksha Bandhan : ‘బహుమతులు డబ్బాల్లో రావు’ అమెజాన్ హార్ట్ టచ్చింగ్ రక్షాబంధన్ వీడియో

Amazon Raksha Bandhan 2021

Amazon-Raksha Bandhan Heart Touching Video :  అక్కా-తమ్ముడు, అన్నాచెల్లి అనుబంధాలను చాటి చెప్పే రక్షాబంధన్ వేడుక. బంధాలకు, అనుబంధాలను గట్టిగా కట్టి ఉంచే వేడుక. అటువంటి రాఖీ పండుగ తోబుట్టువుల మధ్య ఎంతటి అనుబంధం ఉంటుందో చాటి చెప్పేలా ప్రముఖ ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజం అమెజాన్‌ ఓ సరికొత్త వీడియోను విడుదల చేసింది. ఆ ప్రకటన చూసిన వాళ్లకు నిజమే కదా..అక్క అయినా చెల్లెలు అయినా వారికి ఎటువంటి కష్టం రాకుండా ఎటువంటి ఇబ్బందులు దరి చేరకుండా వారి కళ్లలో చిన్న తడి చెమర్చినా తట్టుకోలేని అన్నా తమ్ముడు ప్రేమానురాగాలను ఈ వీడియోలో చూపించింది అమెజాన్. ఈ వీడియో చూస్తే అమెజాన్ అమేజింగ్ బంధాల వీడియో అని తప్పకుండా అంటాం. ఇది ప్రకటనే అయినా నిజజీవితానికి అద్దం పట్టేలా ఉంది ఈవీడియోలో రాఖీ పండుగ నాడు సోదరసోదరీమణుల మధ్య అల్లుకున్న అల్లరి అనుబంధం..

ఈ వీడియోలో ఓ అక్కా తమ్ముడు. రాఖీ పండుగ రోజున తమ్ముడికి అక్క రాఖీ కట్టింది. రాఖీ కట్టిన అక్క నీకంటే నేను పెద్ద నాకాళ్లు మొక్కు అంటుంది.తమ్ముడు కాళ్లకు నమస్కరిస్తుండగా అక్క తమ్ముడి వీపుమీద సరదాగా, ప్రేమగా, మురిపెంగా మూడుసార్లు కొడుతుంది. అక్కడే ఉన్న మరో వ్యక్తి ‘ఇంకో దెబ్బ వేయి’ అంటాడు. దానికి తమ్ముడు ‘ఏంటీ ఇంకో దెబ్బ’ అంటూ వీపు మీద చేయి పెట్టి తముడుకుంటాడు.

amazon

amazon

తరువాత అక్క ‘ఇదిగో నేను షీర్‌ ఖుర్మా చేశాను తిను’ అంటూ ఓ గిన్నె ఇస్తుంది. దానికి తమ్ముడు సరదాగా అక్కను ఆటపట్టిస్తూ ‘నిజమా!’ అంటూ గిన్నె తీసుకుని తింటూ ‘చాలా బాగుంది’ అంటాడు. అయితే నాకు పెట్టు అంటుంది అక్క. దానికి తమ్ముడు నేనివ్వను అంటూ పారిపోతుంటాడు. ‘నీకోసం పొద్దటి నుంచి ఉపవాసం ఉన్నా ఇమ్మంటే ఇవ్వవా..అంటూ ‘నువ్వు ఇవ్వకపోయినా నేను తీసుకుంటా’ అని అక్క పెద్ద గిన్నె తీసుకోబోతుండగా తమ్ముడు అడ్డుపడతాడు. ‘ఈ మొత్తం నేనే తింటా.. నేనెవరికి ఇవ్వను’ అంటూ అది పట్టుకుని పరుగు పెడతాడు తమ్ముడు.‘నాక్కొంచెం’ అంటూ వెంటపడుతుంది అక్క. వారిద్దరు సరదాగా గొడవ పడుతుండగా తల్లి వంట గది నుంచి పిలుస్తుంది. ‘నేను వచ్చేంత వరకు తిన్నావో నిన్ను చంపేస్తా’ అంటూ బెదిరిస్తూ వంటగదిలోకి వెళ్లుతుంది అక్క తల్లి దగ్గరకు.

తల్లి సాల్ట్ డబ్బా ఎక్కడ? అడుగుతుంది. ఆ పక్కనే ఉందని డబ్బా చూపించగా ‘ఎక్కడ లేదు. మొత్తం అయిపోయింది’ అని తల్లి చెబుతుంది. లేదమ్మా అక్కడే ఉండాలి’ అని డబ్బా తీసుకుని చూడగా చక్కెర, ఉప్పు డబ్బా ఒకటేలా ఉండటంతో అక్క షాక్ అవుతుంది. వెంటనే తాను చేసిన పొరపాటు ఏంటో తెలుసుకుంటుంది. చక్కెర అనుకుని పొరపాటున ఉప్పు వేసినట్లు గ్రహించి వెంటనే బయటకు రాగా తమ్ముడు ఇంట్లో పాయసం ఎవరికీ ఇవ్వకుండా ఆటపటిస్తుంటాడు.వెంటనే చేతిలోని గిన్నెలాగి రుచి చూడగా ఉప్పుతో కూడిన పాయసం ఉండడంతో తినలేకపోయింది. తాను తప్పు చేసినా సోదరుడు కప్పిపెట్టేసి ‘బాగుంది’ అని చెప్పడంతోపాటు అది తమను తినకుండా చేసిన సోదరుడి మనసును గుర్తించింది. వెంటనే ఆమె హత్తుకుంటుంది.

amazon store

amazon store

అతడి భుజంపై కన్నీళ్లు రాలుస్తుండగా ‘అక్క ఏడవద్దు. ఇగో నీకో గిఫ్ట్‌ తెచ్చా. చూడు’ అని చెప్పగా ‘నువ్వు ఆల్రెడీ ఇచ్చేశావ్‌’ అంటుండగా యాడ్ కంప్లీట్ అవుతుంది. అక్క పొరపాటు తమ్ముడు గ్రహించినా అక్క బాధపడుతుందని తమ్ముడు పాయసం పెట్టను అంటూ ఆటపట్టించినట్లుగా అర్థం అవుతుంది. నిజ జీవితానికి దగ్గరగా ఈ ప్రకటన ఉండడంతో రాఖీ పండుగ రోజు ఈ వీడియో కొంత భావోద్వేగాన్ని కలిగించింది. సోదరసోదరీమణుల మధ్య అనుబంధాన్ని రెండే రెండు నిమిషాల్లో అద్భుతంగా చూపించారు ఈ వీడియోలో. చివరగా ‘కొన్నిసార్లు బహుమతులు డబ్బాల్లో రావు’ అని చెబుతూనే ‘ఈ రాఖీ పండుగ ప్రేమను పంచండి’ అంటూ అమెజాన్‌ పేర్కొంది. చివరి ఈ రెండు మాటలు మనస్సుల్ని టచ్ చేస్తాయి.