Amazon : అదిరిపోయే ఆఫర్.. ఉద్యోగులకు డబ్బులు‌, కార్లు

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్‌ ఇచ్చింది. వ్యాక్సిన్‌ తీసుకున్న ఉద్యోగులకు లాటరీ టికెట్‌ ద్వారా పెద్ద మొత్తంలో బహుమతులు ఇవ్వనుంది. 'మ్యాక్స్‌ యువర్‌ వ్యాక్స్‌' లో భాగంగా వ్యాక్సిన్‌ వేయించుకున్న ఉద్యోగులకు

Amazon :  అదిరిపోయే ఆఫర్.. ఉద్యోగులకు డబ్బులు‌, కార్లు

Amazon

Amazon : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్‌ ఇచ్చింది. వ్యాక్సిన్‌ తీసుకున్న ఉద్యోగులకు లాటరీ టికెట్‌ ద్వారా పెద్ద మొత్తంలో బహుమతులు ఇవ్వనుంది. ‘మ్యాక్స్‌ యువర్‌ వ్యాక్స్‌’ లో భాగంగా వ్యాక్సిన్‌ వేయించుకున్న ఉద్యోగులకు క్యాష్ ప్రైజ్, కార్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించనుంది. ఇందుకోసం రూ.14.9 కోట్లను కేటాయించింది. వ్యాక్సిన్ తీసుకున్న ఫ్రంట్ లైన్ ఉద్యోగులకు లాటరీ టికెట్లు అందజేస్తూ.. డ్రాలో విజేతలుగా నిలిచిన మొదటి ఇద్దరికి రూ.3.7 కోట్లను అమెజాన్ అందించనుంది. తర్వాత ఆరుగురికి రూ. 74లక్షలు, మరో ఐదుగురికి కార్లు, వెకేషన్ ప్యాకేజీలను అందించనుంది.

అమెజాన్ సడెన్ గా ఇలా ఆఫర్ ప్రకటించడానికి కారణం లేకపోలేదు. 2 నెలల క్రితం టీసుకున్న వారికి మాస్క్‌ అవసరం లేదని అమెరికా ప్రభుత్వం తెలిపింది. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని ప్రజలు మాస్క్‌లు లేకుండా, కోవిడ్‌-19 నిబంధనల్ని ఉల్లంఘించడంతో మరోసారి కరోనా విజృభించింది.

‘మాస్క్‌ ఫ్రీ’ ప్రకటనతో అమెరికా ఇబ్బందుల్లో పడింది. మరోసారి కరోనా విజృంభించింది. మహమ్మారి అగ్రరాజ్యానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రోజుకు కనీసం లక్షకుపైగా కొత్త కేసులు నమోదు కావడంతో పాటు.. వందల సంఖ్యలో డెల్టా వేరియంట్‌ బాధితులు ఆస్పత్రిపాలవుతున్నారు. ఇప్పటికే మాస్క్‌ ఫ్రీ అని ప్రకటించిన అమెజాన్‌ సైతం దిద్దుబాటు చర్యలు తీసుకుంది. ఇక అమెజాన్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు చెందిన లాజిస్టిక్స్‌ సెంటర్‌లో పనిచేస‍్తున్న 9మంది ఉద్యోగులు వ్యాక్సినేషన్‌ వేయించుకోలేదు. పైగా మాస్క్‌ లేకుండా తిరగడం వల్ల.. సహోద్యోగులు కరోనా బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన అమెజాన్‌ వ్యాక్సిన్‌ ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలుస్తోంది.