అమెజాన్ సంచలనం : 3 వేల ఉపగ్రహాల ప్రయోగానికి రెడీ

  • Published By: veegamteam ,Published On : April 5, 2019 / 04:03 AM IST
అమెజాన్ సంచలనం : 3 వేల ఉపగ్రహాల ప్రయోగానికి రెడీ

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ వ్యాపారంలో సాటిలేని మేటిలేని సంస్థగా పేరొందిన అమెజాన్ అంతరిక్షంలో కూడా తన మార్క్ ను చూపించేందుకు రెడీ అవుతోంది. తన వ్యాపార అవసరాల కోసం ఉపగ్రహాలను ప్రయోగించాలని అదికూడా భారీ సంఖ్యంలో ప్రయోగించాలనే సంచనలన నిర్ణయం తీసుకుంది.
Read Also : నంబర్ ప్లేటు మారితే బుక్కైపోతారు

ఈ క్రమంలో ఇంటర్నెట్ అవసరాల కోసం ఏకంగా మూడు వేల ఉపగ్రహాలను ప్రయోగించాలనే సంచలన ప్రాజెక్టు నిర్ణయాన్ని తీసుకుంది. బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం  3 వేల ఉపగ్రహాలను ప్రయోగించాలనే సంచలన ప్రాజెక్టుకు తెరతీసింది. దీని కోసం ‘ప్రాజెక్ట్ కుయిపెర్’ను ప్రారంభించింది. 

హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు ప్రారంభించేందుకు నిర్ణయించుకుంది. బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ అవసరాలకు నోచుకోని ప్రపంచంలోని పలు ప్రాంతాలకు వీటి ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఉద్దేశించి ఈ దీర్ఘకాలిక ప్రాజెక్టును ప్రారంభించనున్నట్టు తెలిపింది. తక్కువ ఎత్తులో పరిభ్రమించే ఈ ఉపగ్రహాలతో లో-లేటెన్సీ, హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీని అందించగలవని అమెజాన్ సంస్థ  పేర్కొంది.
Read Also : సిటిజన్‌ల డిమాండ్: ఫ్లై ఓవర్ తెరవండి.. ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి