అమెజాన్ ఫ్రెష్ స్టోర్.. ఫస్ట్ ఫిజికల్ సూపర్ మార్కెట్.. ఫోన్ అక్కర్లేదు.. బుట్టలో వేయగానే బిల్ పే అయిపోతుంది!

అమెజాన్ ఫ్రెష్ స్టోర్.. ఫస్ట్ ఫిజికల్ సూపర్ మార్కెట్.. ఫోన్ అక్కర్లేదు.. బుట్టలో వేయగానే బిల్ పే అయిపోతుంది!

Amazon Fresh Store : అమెజాన్ ఫ్రెష్ స్టోర్ వచ్చేసింది.. ఇతర సూపర్ మార్కెట్ల మాదిరిగానే ఉండే ఈ అమెజాన్ ఫిజికల్ సూపర్ మార్కెట్లో కనిపించని కొత్త టెక్నాలజీ ఉందంట. నో చెక్ ఔట్.. ఐటమ్స్ పిక్ చేయగానే బిల్ పే అయిపోతుందంట.. యూకేలోనే మొట్టమొదటి అమెజాన్ ఫ్రెష్ స్టోర్ ప్రారంభమైంది.
ఇతర సూపర్ మార్కెట్లకు ఈ అమెజాన్ ఫ్రెష్ స్టోర్ కు మధ్య చాలా వ్యత్యాసం ఉంది.. ఇందులో ఎలాంటి చెక్ ఔట్స్ ఉండవు.. సెన్సార్లు, కెమెరాల డిటెక్ట్ చేసేస్తాయి. కొనుగోలుదారులు ఏదైనా ఐటమ్ పిక్ చేయగానే.. ఆటోమాటిక్‌గా ఐటమ్ ఛార్జ్ చేసేస్తాయి. బాస్కెట్లో వేసి బయటకు వెళ్లేలోగా బిల్ మొత్తం పే అయిపోతుంది. ఈ అమెజాన్ ఫ్రెష్ స్టోర్ లో ఎంటర్ అయ్యే ముందు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది.

మీ కార్డును అమెజాన్‌తో రిజస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. షాపింగ్ చేసే సమయంలో స్మార్ట్ ఫోన్ కూడా క్యారీ చేయాల్సిన పనిలేదు. ఈ అమెజాన్ స్టోర్‌లో కేవలం అమెజాన్ సొంత బ్రాండ్ ఐటమ్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. అందులో ఎక్కువగా మిల్క్, బ్రెడ్, రెడీ మిల్స్, మరెన్నో ఐటమ్స్ రెడీగా ఉంటాయి. 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈయిలింగ్ బోర్డువే కలిగిన ఈ అమెజాన్ స్టోర్ వెస్ట్ లండన్ లో ఉంది.

అమెరికాలో ఇతర సూపర్ మార్కెట్ పోటీదారులకు పోటీగా అమెజాన్ ఈ కొత్త ఫిజికల్ సూపర్ మార్కెట్ ప్రారంభించింది. ఈ కొత్త అమెజాన్ ఫ్రెష్ స్టోర్లను ఇతర ప్రదేశాల్లో కూడా లాంచ్ చేసేందుకు అమెజాన్ ప్లాన్ చేస్తోంది. ట్రైన్, బస్ స్టేషన్లు, ఆఫీసులు, హై రిసిడెన్షియల్ ప్రాంతాలపై ఫోకస్ పెట్టింది. వర్కర్లు, వినియోగదారుల కోసం మీల్ కూడా అందిస్తోంది. ఒక శాండ్ విచ్ లేదా పాస్తా ప్లస్ ధర 1 పౌండ్ తో డ్రింక్, స్నాక్ కొనుక్కోవచ్చు.

ఆన్ లైన్ వినియోగదారుల కోసం అమెజాన్ హబ్ అనే డెలివరీ సర్వీసు అందిస్తోంది. దీని ద్వారా పార్శల్ రిటర్న్, పికప్ పాయింట్ అని సదుపాయాలను అందిస్తోంది. ప్రస్తుతం కోవిడ్ ఆంక్షల కారణంగా అమెజాన్ ఫ్రెష్ స్టోర్ లో కేవలం 20 మంది కస్టమర్లకు మాత్రమే అనుమతి ఉంది. మాస్క్ లు ధరించడం మరిచిపోయినవారికి ఉచితంగా మాస్క్ అందిస్తారు. మాస్క్ లేకుండా లోపలకి అనుమతించరు.