పూప్‌ డిజైన్‌తో అమెజాన్ హెడ్ క్వార్టర్ అద్ధాల మేడ

పూప్‌ డిజైన్‌తో అమెజాన్ హెడ్ క్వార్టర్ అద్ధాల మేడ

amazon

Amazon Headquarters: అమెజాన్ తన తర్వాతి హెడ్ క్వార్టర్ కు సంబంధించిన డిజైన్ ను రివీల్ చేసింది. వర్జినీయా హెడ్ క్వార్టర్స్ అయిన అర్లింగ్‌టన్ లో నిర్మించనున్న ఈ విలాసవంతమైన ఆఫీస్ కొత్త స్టైల్లో కడుతున్నారు. అద్దాల మేడ మొత్తాన్ని దాదాపు చెట్లతో నింపేయనున్నారు. కార్క్ స్క్ర్రూ షేప్ లో ఉన్న బిల్డింగ్ కు ద హెలిక్స్ అనే పేరు పెట్టనున్నారట.

చక్కటి రంగులతో నింపేయడంతో మరింత ఆకర్షణీయంగా మారిపోయిందని అంటున్నారు. అమెజాన్ ఎంప్లాయీస్ తమకు ఇష్టమైన వర్క్ తో ఆ వాతావరణాన్ని మార్చేసుకోవచ్చట కూడా. ఇక బిల్డింగ్ బయటవైపు మొత్తం లోకల్ ప్లాంట్స్ తో నింపేస్తారు. 350అడుగుల ఎత్తు ఉన్న బిల్డింగ్‌ను చూసేందుకు వీకెండ్స్‌లో పబ్లిక్‌కు ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు.

సీటిల్ హెడ్ క్వార్టర్స్ లోనూ ఇటువంటి స్ట్రక్చర్ నే రూపొందించింది అమెజాన్. కాకపోతే అక్కడ గోళాకారంలో మొత్తం గ్రీనరీతో నింపేసింది. తర్వాత నిర్మించబోయే బిల్డింగ్ ప్రపోజల్ దశలో మాత్రమే ఉంది. ఇంకా లోకల్ అప్రూవల్ దక్కించుకోవాల్సి ఉంది. ఈ బిల్డింగ్ చుట్టూ ఉండే పరిసరాలను ఎన్బీబీజే ఆర్కిటెక్చర్ డిజైన్ చేసింది.

ఇది మొత్తం 22అంతస్థుల బిల్డింగ్. ఇక్కడ ఒక ప్లాజా ఏర్పాటు చేసి గ్రీన్ స్పేస్ రెడీ చేయడంతో పాటు డాగ్ రన్ కూడా సెట్ చేస్తారు. రిటైల్ స్టోర్స్, రెస్టారెంట్లు, ఫుడ్ ట్రక్స్ కోసం కంపెనీ ప్లాన్ చేస్తుంది. దాదాపు 950 సైకిల్స్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. ఆర్లింగ్ టన్స్ పెంటగాన్ సిటీ పక్కనే ఉన్న పెన్ ప్లేస్ లో దీని నిర్మాణం జరుగుతుంది.