అమెజాన్ చేసే ప్లాస్టిక్ వేస్టేజ్‌తో ప్రపంచాన్ని 500సార్లు చుట్టేయొచ్చట!!

అమెజాన్ చేసే ప్లాస్టిక్ వేస్టేజ్‌తో ప్రపంచాన్ని 500సార్లు చుట్టేయొచ్చట!!

Amazon: ఆన్‌లైన్లో ఆర్డర్ పెట్టామా.. ఇంటికి సేఫ్‌గా వచ్చిందా.. అది ఓపెన్ చేసేటప్పుడు కవర్ సీల్ వేసి ఉందా.. ఆల్రెడీ ఓపెన్ చేసి ఉందా అని చెక్ చేసుకుంటామే గానీ ఆ ప్లాస్టిక్ వల్ల ప్రకృతికి ఎంత ప్రమాదమో ఆలోచిస్తున్నామా.. కచ్చితంగా కాకపోయిండొచ్చు. అన్ని ఆన్ లైన్ వస్తువుల కొనుగోలులో చేసే పొరబాటే ఇది. ఉదహారణకు Amazonను తీసుకుంటే..

Amazon ప్యాకేజింగ్ వల్ల సంవత్సరానికి 10వేల టన్నులు(22మిలియన్ పౌండ్లు) ఫలితంగా తాజా నీరు, మెరైన్ ఎకోసిస్టమ్స్ మీద తిరుగులేని నష్టం వస్తుంది. 2019లో అమెజాన్ ప్యాకేజింగ్‌లో ఎయిర్ పిల్లోస్, బబుల్ రాప్, ఇతర ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఐటెంలు కలిపి 7 బిలియన్ వరకూ ఉన్నాయట. ఈ వేస్టేజ్ అంతా కలిపితే భూమిని 500సార్లు చుట్టి రావొచ్చట.

దాంతో పాటు ఓసియానా అనే మీడియా యూకే, యూఎస్, కెనాడాలోని 5వేల మంది Amazon కస్టమర్లపై సర్వే నిర్వహించింది. ఆ సమయంలో 86శాతం ప్లాస్టిక్ పొల్యూషన్ జరుగుతుందని అది నీటి వనరులపై ప్రభావం చూపిస్తుందని రియలైజ్ అవ్వగా.. 87శాతం మంది Amazon లాంటి ఆన్ లైన్ రిటైలర్లు ప్లాస్టిక్ ఫ్రీ.. ప్యాకేజింగ్ కావాలని కోరుకుంటున్నారట.

పొల్యూషన్ క్రియేట్ అవడానికి ప్లాస్టిక్ అనేది మేజర్ వనరు. సముద్రంలో జీవించే జంతువుల్లో 90శాతం దీని కారణంగా నాశనమైపోతుంది. రీసైకిల్ చేయకుండా వదిలేస్తున్న ప్లాస్టిక్ చాలా నాశనం తెచ్చిపెడుతుంది. ఇలాంటి చాలా సంస్థలు తాము సంపాదిస్తున్న దాని కంటే రీసైకిల్ చేయకుండా వదిలిపెట్టేస్తున్న ప్లాస్టిక్ శాతమే ఎక్కువగా ఉంది. గతేడాది Amazon లాంటి పెద్ద సంస్థ 53వేల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ ప్లాస్టిక్ ను వాడింది.