71 ఏళ్ల క్యాన్సర్ మహిళకు 105 రోజులుగా కరోనా..కనిపించని లక్షణాలు..ఆశ్చర్యపోతున్న డాక్టర్లు 

  • Published By: nagamani ,Published On : November 7, 2020 / 11:05 AM IST
71 ఏళ్ల క్యాన్సర్ మహిళకు 105 రోజులుగా కరోనా..కనిపించని లక్షణాలు..ఆశ్చర్యపోతున్న డాక్టర్లు 

America 71 years old  cancer patient corona : సంవత్సరం నుంచి కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడించేస్తోంది. కరోనాపై ఎన్ని పరిశోధనలు చేస్తున్నా ఎప్పటికప్పుడు సరికొత్తగా మారి పరిశోధకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక్కొక్కరిలో ఒక్కోరంగా కనిపిస్తోంది. కొంతమందిలో అయితే అసలు కరోనా సోకిన లక్షణాలే కనిపించకుండానే ప్రాణాలు తీసేస్తోంది. కరోనా తీరుతెన్నులు అంచనా వేయడంలో పరిశోధకులు పూర్తిగా సఫలమయ్యారని చెప్పలేని పరిస్థితి నెలకొంది.




ఏడాది గడుస్తున్నా కరోనా సామాన్య ప్రజల్నే కాదు పరిశోధకుల్ని కూడా కలవరానికి గురిచేస్తోంది. ఈక్రమంలో బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న 71 సంవత్సరాల ఓ వృద్ధురాలి శరీరంలో కరోనా 105రోజుల నుంచి తిష్టవేసినా ఆమెలో ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ అయిన ఆమెలో కరోనా వైరస్ లక్షణాలను గుర్తించిన డాక్టర్లు  ఆశ్చర్యపోయారు.

 

సాధారణంగా కరోనా వైరస్ మనిషి 8 రోజుల వరకు ఉంటుంది. అయితే అమెరికాలో ఓ బ్లడ్ క్యాన్సర్ పేషెంటులో ఆశ్చర్యం కలిగించేలా కరోనా వైరస్ 105 రోజుల పాటు ఎటువంటి లక్షణాలు బైటపడకుండా స్తబ్దుగా ఉండిపోవటాన్ని గుర్తించిన పరిశోధకులు కూడా ఆశ్చర్యపోయారు.




మరింత ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే… ఆ క్యాన్సర్ పేషెంటు కరోనా పాజిటివ్ వ్యక్తిగా ఉన్నా..70 రోజుల పాటు ఎటువంటి లక్షణాలు కనిపించకపోవటం..పైగా ఆ రోగికి 71 సంవత్సరాలు కావటం మరో విశేషం. దీనిపై అమెరికాలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజస్ సంస్థ ఓ అధ్యయనం చేపట్టింది.
https://10tv.in/presidential-election-counting-in-america/



ఈ సంస్థకు చెందిన విన్సెంట్ మున్ స్టర్ అనే వైరాలజిస్ట్ ఈ విషయంపై మాట్లాడుతూ..తాము కరోనాపై అధ్యయనం ప్రారంభించిన సమయంలో కరోనా వైరస్ మనిషి శరీరంలో ఎంతకాలం ఉంటుందనే విషయంపై అవగాహన లేదనీ..కానీ 71 ఏళ్ల క్యాన్సర్ పేషెంట్ లో కరోనాను ఎదుర్కొనేందుకు యాంటీబాడీలు ఉత్పత్తి కాకపోవడంతో వైరస్ పై శరీరం పోరాటం ప్రారంభించలేదని..దాంతో కరోనా వైరస్ ఆమె శరీరంలో స్తబ్దుగా ఉండిపోయిందని తెలిపారు.


కాగా..ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ కరోనా మహమ్మారికి ఇప్పటికీ వైరస్ ను ఎదుర్కొనే ఎటువంటి వ్యాక్సిన్ రాలేదు. దీనికంటూ ప్రత్యేకించి మెడిసిన్స్ కూడా లేవు.ఇతర వ్యాధులకు వినియోగించే మెడిసిన్స్ నే కరోనా కరోనా చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ఓవైపు కేసుల సంఖ్య ఇప్పటికీ కట్టడి కావడంలేదు. యూరప్ దేశాల్లో రెండో తాకిడి (సెకండ్ వేవ్) కూడా ప్రారంభమైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5 కోట్లకు చేరువలో ఉన్నట్లుగా తెలుస్తోంది.