పెంపుడు కుక్కతో ఆడుకుంటూ జారి పడిన జో బైడెన్..కాలికి గాయం

  • Edited By: nagamani , November 30, 2020 / 10:29 AM IST
పెంపుడు కుక్కతో ఆడుకుంటూ జారి పడిన జో బైడెన్..కాలికి గాయం

America Biden slipping while playing with his dog : అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తన పెంపుడు కుక్కతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు జారి పడిపోయారు. ఈ ఘటన శనివారం (నవంబర్ 28,2020)జరుగగా జో కార్యాలయం ఆదివారం ప్రకటించింది.ఈ ఘటనలో జో కాలికి గాయమైంది. చీలమండకు గాయం కావటంతో జోకు డాక్టర్లు చికిత్స చేస్తున్నారు.అమెరికా నూతన ప్రెసిడెంట్ గా త్వరలో ప్రమాణస్వీకారం చేయనున్న జో బైడెన్ తన పెంపుడు శునకమైన జర్మన్ షెపర్డ్‌తో కలిసి ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు జారిపడటంతో ఆయన చీలమండకు గాయమైంది. ఆర్థోపెడిక్ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు బిడెన్ కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.కాగా..జో బైడెన్ వద్ద రెండు మేలు జాతి జాగిలాలున్నాయి. అవంటే ఆయనకు చాలా ఇష్టం. వాటితో సరదగా ఆడుకుంటుంటారు. ఈ క్రమంలో ఆయన ప్రమాదశాత్తు జారిపడ్డారు. ఈ రెండు కుక్కల్లో ఒకదానికి జో 2008లో దత్తత తీసుకున్నారు. మరొక జాగిలాన్ని 2018లో దత్తత తీసుకున్నారు.
https://10tv.in/three-telangana-persons-died-in-road-accident-in-texas/


రెండేళ్ల క్రితం దత్తత తీసుకున్న మేజర్తో అనే శునకంతో ఆడుకుంటుండగా ఆయన గాయపడినట్టు బైడెన్ సిబ్బంది తెలిపారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం అనంతరం శునకాలు కూడా ఆయన వెంట వైట్‌హౌస్‌కు రానున్నాయి.కాగా 78 సంవత్సరాల వయస్సున్న బైడెన్ చాలా జాగ్రత్తగా ఉంటారు. అయినా ప్రమాదవశాత్తు ఇలా జరిగిందని ఆయన సిబ్బంది తెలిపారు. చికిత్స తరువాత ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు.