ప్రాణం కాపాడి చనిపోయిన పెంపుడు కుక్క క్లోనింగ్ కోసం రూ.35 లక్షల ఖర్చు

  • Published By: veegamteam ,Published On : February 29, 2020 / 05:29 AM IST
ప్రాణం కాపాడి చనిపోయిన పెంపుడు కుక్క క్లోనింగ్ కోసం రూ.35 లక్షల ఖర్చు

చనిపోయిన తమ పెంపుడు కుక్క కోసం ఓ కుటుంబం 50వేల డాలర్లు (రూ.35 లక్షల)ఖర్చు చేసేందుకు సిద్ధమైంది ఓ కుటుంబం. ప్రాణప్రదంగా పెంచుకున్న కుక్క చనిపోయింది. దాంతో ఆ దంపతులిద్దరు తల్లడిల్లిపోయారు. దాన్ని మరచిపోలేకపోతున్నారు. దీంతో ఆ కుక్క జ్ఞాపలను మరిచిపోలేక దాన్ని క్లోనింగ్ ద్వారా అచ్చు అటువంటి కుక్క కోసం 50వేల డాలర్లు ఖర్చు చేసేందుకు సిద్ధపడ్డారు.

వివరాల్లోకి వెళితే..అమెరికాలో నివసించే అలిసియా, డేవిడ్ లు ఓ కుక్కను పెంచుకున్నారు. దానికి లాబ్రడార్ అని పేరు పెట్టుకుని సొంతబిడ్డలా చూసుకుంటున్నారు. ఈక్రమంలో క్యాన్సర్ వచ్చి ఐదు సంవత్సరాల క్రితం లాబ్రడార్ చనిపోయింది. దాంతో అలిసియా, డేవిడ్ లు ఎంతో బాధపడ్డారు. 

ఓసారి అలిసియా ప్రాణాన్ని తన ప్రాణాలు అడ్డువేసి కాపాడింది లాబ్రడార్. పక్కనే పడగ విప్పి బుసకొడుతు అలిసియాను కాటు వేయబోయిన పామును గమనించిన కుక్క తన పంజాతో పాముని ఓ దెబ్బకొట్టింది. ఆ తరువాత ఓపెద్ద కర్ర పట్టుకొచ్చి ఆ పాముని అలిసియా చంపేసింది. అలా పామునుంచి తనను కాపాడిన కుక్క మృతి ఆ కుటుంబాన్ని ఎంతగానో కలిచివేసింది. 

దీంతో లాబ్రడార్ క్లోనింగ్ తో మరో కుక్కను పుట్టింది దాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో వారు 1996లో డాలీ అనే గొర్రెపిల్లను క్లోనింగ్ ద్వారా పుట్టించిన పద్దతి ద్వారానే క్లోనింగ్ తో తమ కుక్కను మళ్లీ పుట్టించాలనుకున్నారు. అలా డాలి క్లోనింగ్ కాపీని పట్టుకుని సైంటిస్టులను కలిశారు. విషయాన్ని వారికి తెలిపారు.

దానికి సైంటిస్టులు మాట్లాడుతూ..అలా చేయటం చాలా రిస్క్ అని..అయితే..కుక్క చనిపోయిన కొద్దిసేపటికే బయాప్సీ తీసుకోవాలని దానికి అవసరమైన కణాలను సేకరించాలని సూచించారు. అవి ఆడకుక్క గర్భంలో కలిపాలి. కానీ క్లోనింగ్ ద్వారా పుట్టించటం చాలా వివాదాస్పదమైన విషయమని సైంటిస్టులు ఆ దంపతులకు సూచించారు.అలా చేయాలంటే దాదాపు 80వేల డాలర్లు ఖర్చు అవుతాయని తెలిపారు. అయినా సరే తమ కుక్క కోసం అంత ఖర్చుపెడతామని స్పష్టంచేశారు అలిసియా డేవిడ్ లు. కానీ వారు చేయాలనుకుంటున్న క్లోనింగ్ పద్ధతి వివాదాస్పదమైంది.

దీనిపై హ్యూమన్ సొసైటీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ స్పందిస్తూ..జంతువులను క్లోనింగ్ ద్వారా పుట్టించటం విధ్వంసకరమైనదనీ తెలిపింది. ఈ ప్రక్రియలో ఫలితాలకంటే దుష్ఫలితాలే ఎక్కువగా ఉంటాయని..క్లోన్ చేసిన జంతువులు గర్భధారణ సమయంలో కడుపులోని చనిపోయే అవకాశం ఉంటుందని అప్పటికీ తట్టుకుని బతికి పిల్ల బైటపడితే పుట్టగానే చనిపోయే అవకాశాలు చాలా ఉంటాయని..కాబట్టి ఇటువంటి ప్రయత్నాన్ని విరమించుకుంటే మంచిదని వారు వివరించారు. కానీ అలిసియా డేవిడ్ లకు మాత్రం తమ ప్రియమైన కుక్క కోసం ఎంతటి రిస్క్ అయిన భరిస్తామని స్పష్టంచేశారు. మరి వారి ప్రయత్నం..తపన ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.   

a

See Also | కరోనా ఎఫెక్ట్: ఒకరికి పాజిటివ్.. మూతబడిన ఫ్యాక్టరీ