అప్పుల ఊబిలో అమెరికా..భారత్ కు రూ.15లక్షల కోట్లు బాకీ

అప్పుల ఊబిలో అమెరికా..భారత్ కు రూ.15లక్షల కోట్లు బాకీ

usa అమెరికా అంటే ప్రపంచ పెద్దన్న. ప్రపంచంలోని చాలా దేశాలకు అప్పులిస్తుంది. అయితే, ఆ దేశం కూడా అప్పులు చేస్తుంది. భారీ ఎత్తున అప్పులు చేస్తోంది. అగ్రదేశం అమెరికా ఇప్పుడు భారీ అప్పుల ఊబిలో చిక్కుకుంది. వివిధ దేశాల వద్ద అమెరికా అప్పు పడిన మొత్తం 27.9 ట్రిలియన్‌ డాలర్లు అని రిపబ్లికన్​ పార్టీకి చెందిన సెనేటర్‌ అలెక్స్‌ మూనీ తెలిపారు.

అంటే ప్రతి అమెరికన్‌ పౌరుడిపై అప్పు 72,309 డాలర్లు (రూ.53,21,924) ఉందని అలెక్స్ తెలిపారు. కరోనా సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇటీవల అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించిన రెండు ట్రిలియన్‌ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని వ్యతిరేకిస్తూ అలెక్స్ ఈ వివరాలు బయటపెట్టారు. ఉద్దీపనను ప్రకటించే ముందు అప్పుల లెక్కలను కూడా చూసుకోవాలని అలెక్స్ మూనీ హితవు చెప్పారు.

అయితే,ఇంకా అభివృద్ది చెందుతున్న దేశంగా మాత్రమే ఉన్న భారత్ దగ్గర కూడా అమెరికా అప్పులు చేసింది. భారత్‌ కూడా అమెరికాకు భారీగా అప్పు ఇచ్చిందని అలెక్స్ వెల్లడించారు. అమెరికా ఇప్పటి వరకు భారత్ కు 216 బిలియన్ డాలర్లు(రూ.1,58, 96,82,24,00,000) బాకీ ఉన్నట్లు అలెక్స్ తెలిపారు. జపాన్​, చైనాలకు ఒక్కో ట్రిలియన్​ డాలర్ల చొప్పున అమెరికా బాకీ ఉందన్నారు. 2000వ సంవత్సరం నాటికి అమెరికా అప్పు 5.6 ట్రిలియన్ డాలర్లుగా ఉండేది. 2050 నాటికి అమెరికా బాకీ.. 104 ట్రిలియన్​ డాలర్లకు చేరుతుందని లెక్క.

మరోవైపు, దాదాపు 140 లక్షల కోట్ల రూపాయల కరోనా ఉపశమన ప్యాకేజీకి అమెరికా ప్రతినిధుల సభ శనివారం 219-212 తేడాతో ఆమోదించింది.