అమెరికాలో ఎన్నికలు : 2021లో అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం

  • Published By: madhu ,Published On : November 4, 2020 / 09:08 PM IST
అమెరికాలో ఎన్నికలు : 2021లో అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం

America president’s term : అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసినప్పటికీ కొత్త అధ్యక్షుడు ప్రమాణం చేయటానికి వచ్చే ఏడాది వరకు ఆగాల్సి ఉంది. ప్రజల ఓట్లతో గెలిచిన ఎలక్టోరల్‌ కాలేజీ సభ్యులు అధ్యక్ష అభ్యర్థికి ఓటు వేయటం, అమెరికా కాంగ్రెస్‌ ఆ ఓట్లను లెక్కించి విజేతను ప్రకటించటం వంటి కీలక ఘట్టాలు ఇంకా మిగిలే ఉన్నాయి. దీంతో అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయడానికి 2021 వరకు ఆగాల్సిందే.



మెలానియా ట్రంప్ ఓటు హక్కు : – 
అమెరికా అద్యక్ష ఎన్నికల్లో ఆ దేశ ప్రధమ మహిళ మెలానియా ట్రంప్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫ్లోరిడాలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో ఆవిడ ఓట్‌ వేశారు. ట్రంపే మళ్లీ అధ్యక్షునిగా గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇరకాటంలో జూనియర్ ట్రంప్ : – 

ఎన్నికల సమయంలో జూనియర్‌ ట్రంప్‌ తన ట్వీట్‌తో ఇరకాటంలో పడ్డాడు. తమ పార్టీ ఆధిక్యతను తెలిపేలా ఆయన వరల్డ్‌ మ్యాప్‌ పోస్ట్‌ చేశారు. అందులో కాశ్మీర్‌ను పాకిస్తాన్‌లో భాగంగా చూపించారు. దీనిపై భారతీయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.



సోహోలో వినూత్న నిరసన : – 
ట్రంప్‌కు వ్యతిరేకంగా న్యూయార్క్‌ సమీపంలోని సోహోలో వినూత్న నిరసన తెలిపారు. ట్రంప్‌ అబద్దాలకోరు అంటూ ఆయన ఇచ్చిన వాగ్దానాలతో పెద్ద గోడ నిర్మించారు. అక్కడి రేడియోకు చెందిన డైరెక్టర్‌ ఈ గోడను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రారంభం అవగానే ఈ గోడను కూల్చేశారు అక్కడి అధికారులు.



ఒప్పందాలపై మార్పు ఉండదన్న అలీ ఖమేనీ : – 
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఇరాన్‌ సుప్రీ లీడర్‌ అలీ ఖమేనీ స్పందించారు. ఈ ఎన్నికలు అమెరికాతో తమకున్న ఒప్పందాలపై ఎలాంటి మార్పు ఉండదన్నారు. అద్యక్షునిగా ఎవరూ గెలిచినా రెండు దేశాల మధ్య సంబంధాలు యదావిధిగా కొనసాగుతాయన్నారు.