Covid 19 : కరోనా బాధితులతో నిండిపోతున్న ఐసీయూ బెడ్స్.. అమెరికాలో మ‌ళ్లీ కలకలం

కరోనావైరస్ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికింది. అమెరికన్లు నిద్రలేని రాత్రులు గడిపారు. ప్రపంచంలో కరోనా కారణంగా అత్యధికంగా ప్రభావితం అయిన దేశం ఏదైనా ఉందంటే..

Covid 19 : కరోనా బాధితులతో నిండిపోతున్న ఐసీయూ బెడ్స్.. అమెరికాలో మ‌ళ్లీ కలకలం

Covid 19

Covid 19 : కరోనావైరస్ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికింది. అమెరికన్లు నిద్రలేని రాత్రులు గడిపారు. ప్రపంచంలో కరోనా కారణంగా అత్యధికంగా ప్రభావితం అయిన దేశం ఏదైనా ఉందంటే అది అమెరికానే. ఆ తర్వాత కరోనా తీవ్రత తగ్గినా.. అక్క‌డింకా కొవిడ్ వైరస్ పెను ప్ర‌భావం చూపిస్తూనే ఉంది. దేశ‌వ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఉన్న ఇంటెన్సివ్ కేర్ బెడ్స్(ఐసీయూ) నిండిపోతున్నాయి. దీంతో మ‌ళ్లీ అమెరికాలో క‌రోనా భ‌యం ప‌ట్టుకుంది.

SBI Alert : ఎస్బీఐ కస్టమర్లకు వార్నింగ్.. ఆ నెంబర్లతో జాగ్రత్త!

కోవిడ్ సోకిన‌, అనుమానిత రోగులు.. ఐసీయూ బెడ్స్ కోసం ఇబ్బందులు ప‌డుతున్నారు. గ‌తేడాదితో పోలిస్తే 15 రాష్ట్రాల్లో ఇప్పుడు ఐసీయూ బెడ్స్‌కు ఎక్కువ డిమాండ్ ఉన్న‌ట్లు ఆరోగ్య‌, మాన‌వ సేవ‌ల శాఖ తెలిపింది. మిన్న‌సొట్టా, కొల‌రాడో, మిచిగ‌న్‌లో 37, 41, 34 శాతం ఐసీయూ బెడ్స్ నిండుకున్నాయి. క‌రోనా పేషెంట్ల‌తో ఆసుపత్రులు ఫుల్‌ కావ‌డంతో ఇత‌ర వ్యాధుల‌తో బాధ‌ప‌డేవారి ప‌రిస్థితి ఆగ‌మ్య‌గోచ‌రంగా మారింది. వ్యాక్సిన్ తీసుకోని వాళ్లే ఎక్కువమంది చనిపోతున్నారు.

Beware Of Children : టీవి, సెల్ ఫోన్లతో గడిపే చిన్నారులతో జాగ్రత్త!….ఎందుకంటే

అమెరికాలో ఇప్ప‌టికీ కరోనా మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంది. రోజూ స‌గ‌టును వెయ్యి మంది కొవిడ్ తో మ‌ర‌ణిస్తున్నారు. గ‌త మూడు నెల‌ల నుంచి ఇదే సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. మ‌ర‌ణాల సంఖ్య పెరిగిందంటే.. ఇన్‌ఫెక్ష‌న్ పెరిగిన‌ట్లే అని డాక్ట‌ర్లు చెబుతున్నారు. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ నెమ్మ‌దిగా ఉన్న కార‌ణంగా మ‌ళ్లీ కేసులు పెరుగుతున్న‌ట్లు అనుమానం వ్య‌క్తం అవుతోంది. సీడీసీ కోవిడ్ నెట్ స‌ర్వియ‌లెన్స్ రిపోర్ట్ ప్ర‌కారం కూడా వ్యాక్సిన్ వేసుకోని వారే ఎక్కువ‌గా ఆస్ప‌త్రి పాల‌వుతున్నారు.