హ్యాపీ క్రిస్మస్ : విద్యార్ధుల కోసం క్యాబ్ డ్రైవర్ గా మారిన స్కూల్ డైరెక్టర్

హ్యాపీ క్రిస్మస్ : విద్యార్ధుల కోసం క్యాబ్ డ్రైవర్ గా మారిన స్కూల్ డైరెక్టర్

America : students school director who has become an uber driver : జీసస్ పుట్టిన రోజు పండుగ క్రిస్మస్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. కానీ కరోనా మహమ్మారి పుణ్యమాని అన్ని పండుగలను చాలా సాదాసీదాగా జరుపుకుంటున్న క్రమంలో క్రిస్మస్ పండుగ జరుపుకోవటానికి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్రిస్మస్ పండుగ వస్తోందంటే చాలు చిన్నారులంతా శాంతాక్లాస్ వచ్చి ఇచ్చే గిఫ్టుల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. ఈ కరోనా పుణ్యమాని శాంతాక్లాజ్ ల సందడి కూడా కరవయ్యేలా ఉంది. దీంతో చిన్నారులంతా చిన్నబోయారు. శాంతాక్లాజ్ ఇచ్చే బహుమతులు కోసం ఎదురు చిన్నారుల మోములు చిన్నబోతున్నాయి. కానీ చిన్నారుల ముద్దుమోముల్లో చిరునవ్వుల కోసం ఓ స్కూల్ డైరెక్టర్ ఏకంగా డ్రైవర్ గా మారింది.

ముఖ్యంగా కరోనాతో అల్లాడుతున్న అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అగ్రరాజ్యంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ఏరియాల్లో ఇండియానాపోలిస్ ప్రాంతం కూడా ఒకటి. ఇక్కడ ఉండే స్థానికులంతా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వారే ఎక్కువగా ఉంటారు. ఈ కరోనా పరిస్థితుల్లో కరోనా కష్టంతో వీరంతా అల్లాడుతున్నారు. దీంతో చిన్నారులకు క్రిస్మస్ గిఫ్టులు కూడా కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు.

ఈ విషయం తెలుసుకున్న రేనీ డిక్సన్ అయే అనే మహిళ అటువంటి చిన్నారులకు క్రిస్మస్ గిఫ్టులు కొన్ని ఇవ్వాలను అనుకుంది. ఆమె ఓ ప్రి-స్కూల్‌ డైరెక్టర్. తన విద్యార్థులకు కరోనా కష్టం తెలియకూడదనుకుంది. తానే బహుమతులు ఇవ్వాలని అనుకుంది. తన స్కూల్లో చదువుకునే విద్యార్థులతోపాటు, వారి అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములకు కూడా తాను గిఫ్టులు ఇవ్వాలనుకుంది. దీనికోసం స్కూలు అయిపోయిన తర్వాత రెండో ఉద్యోగం చేస్తోంది. అదే క్యాబ్ డ్రైవర్ గా.

రేనీ డిక్సన్ ఉబెర్ కంపెనీలో జాయిన్ అయి డ్రైవర్ అవతారం ఎత్తింది. అర్థరాత్రి కూడా క్యాబ్ డ్రైవర్ గా పనిచేసింది. నిద్రకూడా మానుకుని ఎక్స్ ట్రా రైడ్లు కూడా వేసేది. అలా రెండు ఉద్యోగాలు చేసి 2,500 డాలర్లు సంపాదించింది. మన కరెన్సీలో దాదాపురెండు లక్షలు. ఆ డబ్బులతో తన విద్యార్థులందరికీ రెండు బహుమతులు కొనవచ్చు. ఒకటి స్కూలు తరఫున మరొకటి చిన్నారుల తల్లిదండ్రుల కొనిచ్చినట్లుగా లేదా శాంతాక్లాజ్ ఇచ్చినట్లుగా ఇస్తానని రేనీ చెబుతోంది.

అంతేకాకుండా కరోనా కష్టంలో కూడా తన వద్ద టీచర్లుగా పనిచేసేవారికి జీతాలు చెల్లిస్తోంది. అంతేకాకుండా ఈ క్రస్మస్ సందర్భంగా టీచర్లందరికీ 50 డాలర్ల బోనస్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నానని క్మిస్మస్ కానుకగా వారికి బోనస్ ఇస్తానని తెలిపింది రేనీ.

ఇది కేవలం క్రిస్మస్ కోసం మాత్రమే కాదని..ఆ తర్వాత కూడా పిల్లలందరికీ స్వెట్టర్లు, షూస్ లు ఇస్తానని తెలిపింది. ‘‘కరోనా కష్టాలు ప్రజల జీవితాల్లో కల్లోలం సృష్టించాయి. ఈ కష్టం పిల్లలపై బాగా ప్రభావం పడింది. స్కూల్స్ లేక చదువులు సక్రమంగా జరగకా..ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకునే పరిస్థితి లేక పిల్లలు బాగా లోన్లీగా ఫీల్ అవుతున్నారని..కానీ పరిస్థితిని బట్టి వాళ్లు అలా ఉండక తప్పదని..జీసస్ పుట్టినరోజున కూడా వాళ్లు డల్ గా ఉండకూడదనీ..హ్యాపీగా ఉండాలనే ఉద్ధేశంతో తాను ఇలా చేస్తున్నానని రేనీ తెలిపింది. నా విద్యార్దులు హ్యాపీగా ఉండేలా చూసుకోవటం నా బాధ్యత’’ అని రేనీ చెప్తోంది.