కరోనా అంటించుకుని కోలుకుని..ప్లాస్మా అమ్ముకుంటున్న విద్యార్ధులు

10TV Telugu News

America students wantedly corona sell plasma: కరోనా అంటేనే ఆమడదూరం పారిపోతున్న ప్రస్తుత కాలంలో ఏకంగా కావాలనే కరోనా వైరస్ అంటించుకుని ఆ పై చికిత్స తీసుకుని కోలుకున్నాక ప్లాస్మాను అమ్ముకుంటున్న వైనం వెలుగులోకి వచ్చింది.
ఈ పనిచేసేవారు యూనివర్శటీ విద్యార్ధులు కావటం గమనించాల్సిన విషయం. చక్కగా చదువుకోకుండా విద్యార్ధులు తమ ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న్ వైనం అమెరికాలోని ఇదహోలో గల బ్రిఘం యంగ్ యూనివర్శిటీలో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం స్థానికంగా సంచలన సృష్టించింది.


కరోనా సోకితే ఎక్కడ ప్రాణాలు పోతాయోనని, ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. మహమ్మారి వైరస్ అంటుకోకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న క్రమంలో బ్రిఘం యంగ్ యూనివర్సిటీలోని కొంత మంది విద్యార్థులు మాత్రం కరోనాను పెట్టుబడిగా మార్చేసుకున్నారు. కాసుల కోసం కరోనాను అంటించుకుంటున్నారు. తరువాత కరోనానుంచి కోలుకుని ప్లాస్మా దానం పేరుతో వేలల్లో డబ్బులు తీసుకోవడం యూనివర్శిటీలో పెను సంచలనం కలిగించింది. ఈ విషయం తెలిసి షాక్ అయిన బ్రిఘం యంగ్ వర్శిటీ అధికారులు విచారణకు ఆదేశించారు.


బ్రిఘం యంగ్ యూనివర్సిటీ విద్యార్థులు కావాలనే కరోనా వైరస్‌ను అంటించుకుంటున్నారని..కరోనా నుంచి కోలుకున్న తర్వాత తమ ప్లాస్మాను హాస్పిటళ్లకు అమ్ముకుంటున్నారని అధికారులకు తెలిసింది. దీంతో అధికారులు మండిపడ్డారు. ఇటువంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని విద్యార్ధులందరినీ హెచ్చరించారు.


డబ్బులు కోసం ప్రాణాలను ప్రమాదంలోకి తీసుకెళ్లడం ఏంటీ..ఇది వారి ఆరోగ్యాలకే కాదు వర్శిటీలో ఉండి ఇతర విద్యార్దులకు సిబ్బందితో పాటు సమాజానికి పెను ప్రమాదమని..ఇటువంటి పనులు చేస్తే డిబార్ చేస్తామని హెచ్చరించింది. దీంతో ఇతర విద్యార్ధులందరికీ కరోనా టెస్టులు చేసేలా చర్యలు తీసుకుంది. ఇప్పటివరకు బ్రిఘం యంగ్ యూనివర్శిటీలో 119 మంది విద్యార్థులకు కరోనా సోకింది. వారంతా కోలుకొని కొన్ని సంస్థల ద్వారా యాంటీబాడీ ప్లాస్మాలను సేకరించి పలు హాస్పిటళ్లకు..పలు సంస్థలకు అమ్ముకుంటున్నారు. ఒక్కో యూనిట్‌కు 100 నుంచి 200 డాలర్లు చొప్పున హాస్పిటల్ యాజమాన్యాలు సంస్థలు చెల్లిస్తున్నాయి.


ఖర్చుల డబ్బుల కోసం విద్యార్థులు ఇటువంటి ప్రమాదకరమైన దారిని ఎంచుకున్నారు. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండే యువతను కరోనా వైరస్ ఏమీ చేయదనే చెబుతుండటంతో వీరంతా మాకేమీ కాదనే మూర్ఖత్వంతో ఇలా డబ్బుల కోసం తమ ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని తెలుస్తోంది.


ఈ ఘటనపై వర్శిటీ అదికారులు వెంటనే విచారణకు ఆదేశించారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో కొత్త రకం సమస్యలు కోరి తెచ్చుకోవటమేనని నిపుణులు తెలుపుతున్నారు. విద్యార్థులు ఇలా మూకుమ్మడిగా వైరస్‌ను అంటించుకోవడం తోటి విద్యార్ధులను..వర్శిటీ సిబ్బందిని కలవరానికి గురిచేస్తోంది.

10TV Telugu News