సో క్యూట్ వీడియో : విమానంలో గుర్రం ప్రయాణం

  • Published By: veegamteam ,Published On : September 21, 2019 / 10:13 AM IST
సో క్యూట్ వీడియో : విమానంలో గుర్రం ప్రయాణం

విమానం ఎక్కటం సామాన్యులకు కల. కానీ శ్రీమంతులు పెంచుకునే జంతువులకు విమానం ఎక్కటం వెరీ ఈజీ. చాలామంది తమ పెంపుడు జంతువుల్ని విమానంలో తీసుకెళుతుంటారు. కుక్కలు, పిల్లులు, కుందేళ్లు వంటివి తీసుకెళుతుంటారు. కానీ ఓ మహిళ మాత్రం ఏకంగా తన పెంపుడు జంతువు గుర్రంతో పాటు విమానం ఎక్కింది. అది చూసిన ప్రయాణీకులు షాక్ అయ్యారు. ఏదో చిన్న చిన్న జంతువుల్ని విమానంలో తీసుకెళ్ల చూశాం కానీ ఏకంగా గుర్రాన్ని తీసుకురావటమేంటని ఆశ్చర్యపోయారు. 

అది అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం. అది చికాగో నుంచి నెబ్రస్కా నగరంలోని ఒమహాకు వెళ్లటానకి సిద్ధంగా ఉంది. అప్పటికే కొంతమంది ప్రయాణీకులు విమానం ఎక్కారు. అంతలో ఓ మహిళ తన పెంపుడు గుర్రం పిల్లతో సహా విమానం ఎక్కింది. చక్కగా తన సీట్లో కూర్చుంది. అది చూసి ప్రయాణీకులంతా ఆశ్చర్యపోయారు.నోరెళ్లబెట్టి ఆమె వంకా..గుర్రం పిల్ల వంకా చూస్తుండిపోయారు. 

ఇది ఫ్లిర్లీ నా ముద్దుల బుజ్జి గుర్రం పిల్ల అని పరిచయం చేసింది. ఏమాటకామాటే చెప్పుకోవాలి..ఫ్లిర్లీ అదేనండీ గుర్రం పిల్ల కూడా ఏమాత్రం అల్లరి చేయకుండా..చక్కగా బుద్దిగా ఉంది. ఆ విమానంలోని ప్రయాణికులు  మాత్రం ఆ గుర్రం మీద నుంచి చూపు తిప్పుకోలేకపోయారు. ఎందుకంటే అది  పొట్టిగా క్యూట్‌గా ఉంది. విమానంతో పాటు గుర్రం పిల్ల ఫ్లిర్లీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 
కాగా విమానాల్లో పెంపుడు జంతువులకు ఎంట్రీ లేదనే రూల్స్ ని అమెరికా ప్రభుత్వం ఇటీవల సవరణలు చేసింది. మనులకు ఎమోషనల్‌గా దగ్గరైన జంతువుల్ని..లేదా యజమానులకు సేవలందిస్తున్న జంతువులను విమానాల్లో తీసుకెళ్లవచ్చని వెల్లడించింది. అలా తీసుకెళ్లే జంతువులకు సంబంధించిన వివరాలను ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని తెలిపింది. అప్పటి నుంచి అమెరికన్లు తమ పెంపుడు జంతువులతో చక్కగా విమానంలో చక్కర్లు కొట్టేస్తున్నారు. కాకపోతే విమానంలో పెద్ద పెద్ద జంతువులకు అనుమతిలేదు. కుక్కలు, పిల్లులు..ఇదిగో ఇలా చిన్న సైజు గుర్రాలు, మేకలు,గొర్రెలకు మాత్రమే పర్మిషన్ ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో అమెకన్లు వాడి బుజ్జి బుజ్జి జంతువుతో విమానంలో తిరిగేస్తున్నారు.