అమెరికా నిర్వాకం:అమాయకుడికి 37 ఏళ్ల జైలు

  • Published By: veegamteam ,Published On : March 3, 2019 / 09:57 AM IST
అమెరికా నిర్వాకం:అమాయకుడికి 37 ఏళ్ల జైలు

అమెరికా : అమెరికా అంటే పెద్ద గొప్పగా చెప్పుకుంటాం. అక్కడ చట్టాలు చాలా చాలా స్ట్రిక్ట్ గా అమలవుతాయని అనుకుంటాం. కానీ ఓ వ్యక్తి చేయని తప్పుకు దశాబ్దాల పాటు శిక్షను అనుభవించాడు. ఇటువంటి కేసులు ఎన్నో ఉన్నాయని వెల్లడయ్యింది. ఈ క్రమంలో క్రెయిగ్ కోలే అనే వ్యక్తి  ఏం తప్పు (నేరం)చేయకపోయినా 37 ఏళ్లపాటు జైలు శిక్షను అనుభవించిన దౌర్భాగ్యం దాపురించింది. ఇప్పుడతనికి 71 సంవత్సరాలు. తన 34 సంవత్సరాల వయస్సులో  అంటే 1978లో కోలే తన మాజీ ప్రేయసి..ఆమె కొడుకును హతమార్చాడనే ఆరోపణతో అరెస్ట్ చేశారు. కానీ తాను ఏం నేరం చేయలేదని వేడుకున్నాడు కోర్టులో.వాదించుకున్నాడు.. కానీ కోలేను కోర్టు దోషిగా ప్రకటించింది. శిక్షను ఖరారు చేయడంతో అప్పటి నుంచి కటకటాల వెనుకే చేయని తప్పుకు శిక్షను అనుభవిస్తూ వస్తున్నాడు.
 

ఈ క్రమంలో ఇన్ని  దశాబ్దాల తరువాత కోలే కేసుకు సంబంధించిన వివరాలను ఓ డిటెక్టివ్ పున: దర్యాప్తు చేశాడు. అతని డీఎస్ ఏ పరీక్షల ఆధారంగా కోలే నేరం చేయలేదని రుజువయ్యింది. దీంతో కాలిఫోర్నియా గవర్నర్ కోలేకు క్షమాపణలు చెప్పారు. అన్యాయంగా అతనికి  పడిన శిక్షకు చింతిస్తున్నామని..బదులుగా ఏం ఇచ్చినా సరిపోదని అధికారులు పేర్కొన్నారు. 2017 నవంబరులో కోలేను విడుదల చేసిన అధికారులు..అన్యాయంగా జైలు శిక్ష వేసినందుకు గాను కోలేకు 2 కోట్ల 10 లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.149 కోట్లను ఇస్తున్నట్టు ప్రకటించారు. 
 

అమెరికన్ జైళ్లలో చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న కోనే లాంటి వందలాది నిర్దోషులను ప్రతి ఏడాది అధికారులు విడుదల చేస్తూనే ఉన్నారు. తల్లిని చంపినందుకు ఓ వక్తి 19 ఏళ్లు జైళ్లో ఉన్నాడు. తీరా కేసును తిరిగి దర్యాప్తు చేయగా..అతని తప్పు లేదని తెలిసింది. అమెరికన్ జైళ్లలో ఇలాంటి వారు ఇంకెంత మంది ఉన్నారా అన్నదానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తప్పు చేయకుండా శిక్షను అనుభవిస్తున్న వారిని వెతికి వెంటనే విడుదల చేయాలని అధికారులు తగిన చర్యల్ని చేపట్టారు.