చరిత్రలో మొదటిసారి : అమెరికా ఎన్నికలు, కొనసాగుతున్న ఉత్కంఠ

  • Published By: madhu ,Published On : November 4, 2020 / 09:00 PM IST
చరిత్రలో మొదటిసారి : అమెరికా ఎన్నికలు, కొనసాగుతున్న ఉత్కంఠ

American elections : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు లాంగ్‌ మారథాన్‌ను తలపిస్తున్నాయి. కౌంటింగ్‌ ప్రారంభమై 15 గంటలవుతున్నా ఇంకా గెలుపెవరిదన్నదానిపై క్లారిటీ లేదు. అమెరికా చరిత్రలో ఇలాంటి ఫలితం వెలువడటం ఇదే మొదటిసారి. అటు ట్రంప్, ఇటు బైడెన్ ఇద్దరూ గెలుపు తమదేనని ప్రకటించుకున్నప్పటికీ ఎవరూ మ్యాజిక్‌ మార్క్‌కు దగ్గరగా లేరు. స్వింగ్‌ స్టేట్స్‌లో ఇంకా ఫలితం తేలకపోవడంతో విజయం ఊగిసలాడుతోంది.

పెన్సిల్వేనియాను కోల్పోయిన బైడెన్ : – 
ప్రస్తుతం బైడెన్‌ 238, ట్రంప్‌ 213 ఎలక్టోరల్‌ ఓట్లతో ఉన్నారు. మ్యాజిక్‌మార్క్‌ 270. నెవాడా, విస్కాన్సిన్‌తో పాటు మిచిగాన్‌ను గనుక గెలుచుకుంటే బైడెన్‌ మ్యాజిక్‌మార్క్‌ను టచ్‌ చేయవచ్చు. దర్జాగా వైట్‌హౌస్‌లోకి అడుగు పెట్టొచ్చు. అయితే పెన్సిల్వేనియాను కోల్పోవడం బైడెన్‌కు గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. మూడువారాల క్రితం వరకూ ఇక్కడ ఆధిక్యంలో కనిపించిన బైడెన్… తర్వాత వెనకబడ్డారు.

పోస్టల్ ఓట్లు : – 
ఇంకా పోస్టల్‌ ఓట్లు కౌంట్‌ చేయాల్సి ఉండటంతో ఆధిక్యం ఎటైనా మారే అవకాశం ఉంది. ఎక్కువమంది డెమొక్రాట్లు పోస్టల్‌ ఓట్లను వినియోగించుకున్నారు. దీంతో గెలుపు తమదేనని బైడెన్‌ వర్గం ధీమాగా ఉంది. పాపులర్‌ ఓట్ల విషయానికి వస్తే ట్రంప్‌ కంటే బైడెన్‌ దాదాపు 20లక్షలకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. పాపులర్‌ ఓట్లు ఎక్కువగా వచ్చినా విజయం దక్కాలనేం లేదు.

పోస్టులను తొలగించిన ట్విట్టర్ : – 

అమెరికా ఎన్నిల్లో బిజీగా ఉంటే సోషల్‌ మీడియా రాజకీయ పోస్టులను తొలగించే పనుల్లో బిజీ అయ్యింది. ఓటర్లను ప్రలోభ పెట్టేలా, ఇతర వ్యక్తులను కించపరిచేలా ఉన్న పోస్టులను తొలగించాయి సామాజిక మాధ్యమాలు. ఈ క్రమంలోనే ట్రంప్‌ చేసిన ట్వీట్‌ను కూడా తొలగించింది ట్విట్టర్‌.

గెలుస్తామన్న బైడెన్ : – 
జో బైడెన్‌ ట్విటర్ వేదికగా స్పందించారు. మనమే గెలుస్తాం.. నమ్మకం ఉంచండి.. ఈ ఎన్నికల విజేత ఎవరో నిర్ణయించేది నేనో..? ట్రంపో కాదు..? ఓటర్లు.. ఇప్పటి వరకు గెలిచిన సీట్ల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం.. మరిన్ని సీట్లు గెలిచి ఎన్నికల విజేత మనమే అవుతామని నాకు నమ్మకం ఉంది అంటూ బైడెన్ ట్వీట్ చేశారు.

రిపబ్లికన్ పార్టీ గెలిచిందన్న ట్రంప్ : – 
ఫలితాలు పూర్తిగా వెలువడకముందే… అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ గెలిచినట్టు… డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు… ఎన్నికల ఫలితాలను పక్కదారి పట్టించేందుకు కుట్రలు జరిగాయని.. దీనిపై సుప్రీంకోర్టుకు వెళతానట్టు ప్రకటించారు.