అమెరికా ప్రథమ మహిళ : జిల్ బైడెన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

  • Published By: nagamani ,Published On : November 13, 2020 / 01:46 PM IST
అమెరికా ప్రథమ మహిళ : జిల్ బైడెన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

American First Lady Jill Biden : అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ముగిసాయి. ట్రంప్ మాజీ అధ్యక్షుడైపోయారు. జో బైడెన్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. . ఆయన భార్య జిల్ బైటన్ ప్రథమ పౌరురాలు అయ్యారు. ఈక్రమంలో జో బైడెన్ గురించి..ఆయన భార్య జిల్ బైడెన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుసుకుందాం..వారి ప్రేమ..ప్రపోజల్స్..వారి వివాహం బంధం ఎలా ముడిపడింది? వంటి పలు ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం..


జో బైడెన్ అర్ధాంగి జిల్ గురించి చెప్పాలంటే చాలా విషయాలున్నాయి. జిల్ల చాలా చాలా స్ట్రాంగ్. ఆ విషయం స్వయంగా జో నే తెలిపారు. జో ఐదుసార్లు ప్రపోజ్ చేస్తేనే గానీ జిల్ ప్రేమ జోకు లభించలేదు. ఆమెను ఒప్పించటానికి జో చాలా చాలా యత్నించారు. చివరకు ఇద్దరూ ఒకటయ్యారు. ఇద్దరి మధ్యా 9 సంవత్సరాలు తేడా ఉన్నా జిల్ జో ప్రేమను అంగీకరించి అర్థాంగి అయ్యారు.


జిల్ బైడెన్ పూర్తి పేరు జిల్ జాకబ్స్. అమెరికాలోని న్యూజెర్సీలో 1951లో జిల్ జన్మించారు. ఐదుగురు సంతానంలో ఆమెనే పెద్దది. అంటే జిల్ కు నలుగురు చెల్లెళ్లు. అందరూ అమ్మాయిలే కావడంతో ఇంట్లో వాతావరణం చాలా ప్రత్యేకంగా ఉండేది. జిల్ కుటుంబం ఫిలడెల్ఫియా శివారు ప్రాంతంలోని విల్లోగ్రోవ్ లో నివసించేది. జిల్ బైడెన్ కు ముందే ఓ వివాహం అయ్యింది. ఆమె చదివే కాలేజీలో ఫుట్ బాల్ ఆటగాడైన బిల్ స్టీవెన్ సన్ ను వివాహం చేసుకోగా వారిద్దరూ కొంతకాలానికి విడిపోయారు.



ఇక జో బైడెన్ విషయానికొస్తే..ఆయన జీవితంలో అత్యంత విషాదం ఏమిటంటే..1972లో జరిగిన ఓ కారు ప్రమాదంలో జో భార్యను, సంవత్సరం వయస్సు కూతుర్ని కోల్పోయారు. కొడుకులు బ్యూ, హంటర్ మాత్రం జోకు మిగిలారు. ఆ విషాదం నుంచి జో కోలుకోవటానికి చాలా టైమ్ పట్టింది.

ఆ తర్వాత మూడేళ్లకు తన సోదరుడి సాయంతో బైడెన్‌కు జిల్ పరిచయం అయ్యారు. అప్పుడు జో బైడెన్ సెనేటర్ గా ఉన్నారు. జిల్ ఇంకా చదువుకుంటోంది. విద్యార్థినిగా కొనసాగుతున్న ఆమె జీవితంలోకి జో పరియం చాలా పెద్ద మలుపు తిప్పింది. ఆమెను అమెరికా ప్రథమ మహిళను చేసింది.


ఎంతో చురుకుగా ఉండే జిల్ అంటే జో చాలా మక్కువ చూపించేవారు. ఆమెపై ప్రేమ పెంచుకున్నాడు. అలా జిల్ కు జో ప్రపోజ్ చేశారు..‘ఇద్దరం కలిసి నడుద్దాం’’అని కానీ జిల్ ఒప్పుకోలేదు. అలా ఒకసారి రెండు సార్లు కాదు జిల్ కు జో ఐదు సార్లు ప్రపోజ్ చేసారు. కానీ జిల్ కు మాత్రం జో బైడెన్ తో కలిసి జీవించగలనా? అది ఎంత వరకూ సాథ్యమవుతుంది? అనే విషయంపై బాగా ఆలోచించేవారు. కానీ జో తరచూ తన ప్రేమను తెలియజేయటంతో జిల్ మనస్సు కరిగింది. జో ప్రపోజల్ ను ఐదుసార్లు తరువాత అంగీకరించారు.


ఆమె ఓకే చెప్పడంతో ఇద్దరూ జూన్ 17, 1977 పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించారు. ఇద్దరి మధ్య 9 ఏళ్ల వయోభేదం ఉన్నా వారి సంతోషంగానికి అది అడ్డుకాలేదు. ఈ క్రమంలో జిల్ తమ ప్రేమ గురించి చెబుతూ, తొలి పరిచయం తర్వాత లక్ష ఏళ్లయినా బైడెన్ తో తాను సర్దుకుపోవడం కష్టమేనని భావించానని..జోను చూసినప్పుడు ఆయన నాకు ప్రపోజ్ చేసినప్పుడు అదే అనుకునేదాన్ని..కానీ ఆయన ప్రేమ ఇంత గొప్పగా ఉంటుందని ఊహించలేదనీ..నేనంటే ఆయనకు చాలా ప్రేమ అని ఓ ఇంటర్వ్యూలో చమత్కరంగా చెప్పారు.


అటువంటి వెరీ స్ట్రాంగ్ లేడీ జిల్ బైడెన్. ప్రతీ పురుషుడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందనటానికి జిల్ ఓ ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవడం వెనుక జిల్ ప్రోత్సాహం, మద్దతు, నిరంతరం ఆమె చెప్పే ధైర్యం గెలుస్తారు అంటూ నిరంతరం వెన్నంటి నడిపించిన జిల్ ఆత్మవిశ్వాసం చూసి జో ఆశ్చర్యపోయేవారు. జిల్ లాంటి మహిళ నా జీవితంలోకి రావటం నా అర్థాంగికావటం నిజంగా అదృష్టమంటారు జో బైడెన్.