Myanmar : అమెరికా జర్నలిస్టుకు 11 ఏళ్ల జైలు శిక్ష

మయన్మార్ సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పాడనే ఆరోపణలతో అమెరికా జర్నలిస్టు డానీ ఫెన్‌స్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.. అతడికి 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Myanmar : అమెరికా జర్నలిస్టుకు 11 ఏళ్ల జైలు శిక్ష

Myanmar

Myanmar : అమెరికా జర్నలిస్టుకు మయన్మార్ సైనిక కోర్టు 11 ఏళ్ల జైలుశిక్ష విధించింది. దేశ చట్టాలను ఉల్లగించడంతోపాటు.. మయన్మార్ సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పాడనే ఆరోపణలతో అమెరికా జర్నలిస్టు డానీ ఫెన్‌స్టర్‌పై మయన్మార్ పోలీసులు ఏప్రిల్ నెలలో కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మే నెలలో యంగూన్ విమానాశ్రయం వద్ద అరెస్ట్ చేశారు.

చదవండి : Journalist Jailed: కరోనాపై ప్రశ్నించిన మహిళా జర్నలిస్ట్.. ఇప్పుడు చావుబతుకుల మధ్య జైల్లో ఉంది!

ఇక తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన మయన్మార్ సైనిక న్యాయస్థానం దేశద్రోహంతోపాటు, సైనిక రహస్యవిషయాలను బహిర్గతం చేశాడని పేర్కొంటూ 11 ఏళ్లు జైలు శిక్ష విధించింది. కాగా ఫెన్‌స్టర్‌ ఫ్రంటియ‌ర్ మ‌య‌న్మార్ ఆన్‌లైన్ ఎడిష‌న్‌కు మేనేజింగ్ ఎడిట‌ర్‌గా చేస్తున్నారు.

చదవండి : Journalist: తాలిబాన్లను ప్రశ్నించి, అఫ్ఘాన్ నుంచి పారిపోయిన మహిళా జర్నలిస్ట్

ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగిన సైనిక చ‌ర్య త‌ర్వాత మ‌య‌న్మార్‌లో అనేక మంది జ‌ర్న‌లిస్టుల‌ను అరెస్టు చేశారు. దాంట్లో 37 ఏళ్ల ఫెన్‌స్ట‌ర్ కూడా ఉన్నారు. గ‌తంలో మ‌య‌న్మార్ నౌకు ఫెన్‌స్ట‌ర్ ప‌నిచేశారు. కొత్తగా నమోదైన మరికొన్ని ఫిర్యాదులపై న‌వంబ‌ర్ 16న విచార‌ణ జ‌ర‌గ‌నున్న‌ది.