Bone Marrow Cancer : బోన్ మ్యారో క్యాన్సర్ కు సరికొత్త చికిత్స.. కనుగొన్న అమెరికా పరిశోధకులు

బోన్ మ్యారో క్యాన్సర్ (ఎముక మజ్జ క్యాన్సర్)కు ఇప్పటివరకు సరైన చికిత్స లేదు. అయితే అమెరికా పరిశోధకులు క్యాన్సర్ కు సరికొత్త చికిత్సను కనుగొన్నారు. ఈ చికిత్సా విధానంలో ‘టాల్కెటామాబ్’ అనే డ్రగ్ ను రోగులకు ఇంజెక్ట్ చేశారు. రెండు దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు.

bone marrow cancer : బోన్ మ్యారో క్యాన్సర్ (ఎముక మజ్జ క్యాన్సర్)కు ఇప్పటివరకు సరైన చికిత్స లేదు. అయితే అమెరికా పరిశోధకులు క్యాన్సర్ కు సరికొత్త చికిత్సను కనుగొన్నారు. ఈ చికిత్సా విధానంలో ‘టాల్కెటామాబ్’ అనే డ్రగ్ ను రోగులకు ఇంజెక్ట్ చేశారు. రెండు దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు.

ఈ డ్రగ్ ఎముక మజ్జ క్యాన్సర్ కణాలను నాశనం చేసేందుకు రోగి నిరోధక వ్యవస్థను 73 శాతం ప్రేరేపించినట్లు పరిశోధకులు గుర్తించారు. ఇది క్యాన్సర్ కణాల ఉపరితలంపై ఉన్న జీపీఆర్ సీ 5డీ అనే గ్రాహకాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు నిర్ధారించారు.

Inspiration Man Jayant Kandoi : ఆరుసార్లు క్యాన్సర్ ను జయించిన 23 ఏళ్ల యువకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..

ఎముకలోని మూలుగలో నుంచి మూల కణాలు పుడతాయి. అవే ఆ తర్వాత ఎర్ర రక్త కణాలుగా, తెల్ల రక్త కణాలుగా, ప్లేట్ లెట్స్ గా రూపొందుతాయి. మూలుగలోనే తేడా ఉంటే ఏఎంఎల్, ఏఎల్ఎల్ వంటి కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్లు, పుట్టుకతో వచ్చే మరికొన్ని జన్యు పరమైన వ్యాధులు, రక్తానికి సంబంధించిన థలసేమియా సకిల్ సెల్ అనీమియా వంటి వ్యాధులు వస్తాయి.

ట్రెండింగ్ వార్తలు