Bio Coal From Plastic : ప్లాస్టిక్ నుంచి బొగ్గు తయారు.. ఆవిష్కరించిన అమెరికా పరిశోధకులు

మొక్కజొన్న పంట ఉప ఉత్పత్తి అయిన కార్న్ స్టవర్ కు కలపడం ద్వారా బయోచార్ (బొగ్గు అధిక కార్బన్ రూపం)ను రూపొందించారు. ఈ బయోచార్ నేలలో నీటి నిలుపుదల సామర్థ్యాన్ని పెంచి సారవంతం చేస్తుంది.

Bio Coal From Plastic : ప్లాస్టిక్ నుంచి బొగ్గు తయారు.. ఆవిష్కరించిన అమెరికా పరిశోధకులు

bio coal

Bio Coal From Plastic : భూమికి అత్యంత ముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్ నుంచి అమెరికా పరిశోధకులు బొగ్గును తయారు చేశారు. స్టిరోఫోమ్ ప్యాకేజీకి ఉపయోగించే పాలిస్టిరీన్, వాటర్ బాటిళ్ల తయారీకి ఉపయోగించే పాలి ఇథిలీన్ టెరాఫ్త లేట్ పీఈటీ అనే రెండు రకాల ప్లాస్టిక్ ల నుంచి ఈ బొగ్గును తయారు చేయడాన్ని కొనుగొన్నారు.

వీటిని మొక్కజొన్న పంట ఉప ఉత్పత్తి అయిన కార్న్ స్టవర్ కు కలపడం ద్వారా బయోచార్ (బొగ్గు అధిక కార్బన్ రూపం)ను రూపొందించారు. ఈ బయోచార్ నేలలో నీటి నిలుపుదల సామర్థ్యాన్ని పెంచి సారవంతం చేస్తుంది. కాగా, ఈ ప్లాస్టిక్ నుంచి నీటిని ఫిల్టర్ చేసే చార్ కోట్ తయారీపై కూడా ప్రయోగాలు చేస్తున్నట్లు పరిశోధనకు నేతృత్వం వహించిన కాండిస్ లెస్టీ అబ్దుల అజీజ్ తెలిపారు.