Smart Bandage : గాయాలను త్వరగా మాన్పే స్మార్ట్‌ బ్యాండేజ్‌

మన శరీరంలో ఎక్కడ గాయమైనా బ్యాండేజీలు వేసుకుంటాం. అయితే, గాయం మానాలంటే చాలా రోజులు పడుతుంది. ఎన్నో బ్యాండేజీలు మార్చాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కరెంట్‌ను ఉపయోగించుకొని వేగంగా గాయాలను మాన్పే స్మార్ట్‌ బ్యాండేజీని అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఆవిష్కరించారు.

Smart Bandage : గాయాలను త్వరగా మాన్పే స్మార్ట్‌ బ్యాండేజ్‌

smart bandage

smart bandage : మన శరీరంలో ఎక్కడ గాయమైనా బ్యాండేజీలు వేసుకుంటాం. అయితే, గాయం మానాలంటే చాలా రోజులు పడుతుంది. ఎన్నో బ్యాండేజీలు మార్చాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కరెంట్‌ను ఉపయోగించుకొని వేగంగా గాయాలను మాన్పే స్మార్ట్‌ బ్యాండేజీని అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఆవిష్కరించారు.

ఈ స్మార్ట్‌ బ్యాండేజీ గాయాన్ని పర్యవేక్షించడంతోపాటు అదే సమయంలో చికిత్స కూడా చేస్తుంది. ఇది కణజాలాన్ని ప్రేరేపించడం ద్వారా సాధారణ బ్యాండేజ్‌ కంటే 25శాతం వేగంగా గాయాన్ని మాన్పుతుంది. ఇందులో ఉండే వైర్‌లెస్‌ సర్క్యూట్‌ ద్వారా కరెంట్‌ ప్రవహిస్తుంది.

ఇందులోని ఉష్ణోగ్రత సెన్సార్లు గాయాల పరిస్థితిని పర్యవేక్షించి, చికిత్స అందిస్తూ ఉంటాయి. గాయపడిన కణజాలానికి కొత్త రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. అలాగే, చర్మాన్ని పునరుద్ధరించడం ద్వారా గాయం మచ్చలు కనిపించవు.