US Supreme Court: “తుపాకులను పబ్లిక్‌గా తీసుకెళ్లడం అమెరికన్ల ప్రాథమిక హక్కు”

అమెరికన్లు పబ్లిక్ లో తుపాకులు పట్టుకుని తిరగొచ్చని, వారి ప్రాథమిక హక్కుల్లో ఒకటి అని అమెరికా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దేశవ్యాప్తంగా తుపాకుల కాల్పులతో జరుగుతున్న హింసపై జరిగిన విచారణలో ఈ విషయం తేలింది.

US Supreme Court: “తుపాకులను పబ్లిక్‌గా తీసుకెళ్లడం అమెరికన్ల ప్రాథమిక హక్కు”

America

US Supreme Court: అమెరికన్లు పబ్లిక్ లో తుపాకులు పట్టుకుని తిరగొచ్చని, వారి ప్రాథమిక హక్కుల్లో ఒకటి అని అమెరికా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దేశవ్యాప్తంగా తుపాకుల కాల్పులతో జరుగుతున్న హింసపై జరిగిన విచారణలో ఈ విషయం తేలింది. 6-3 నిర్ణయం శతాబ్ద కాలం క్రితం నాటి నియమాలైన హ్యాండ్ గన్ ఉండాలంటే చట్టబద్ధమైన సెల్ఫ్ డిఫెన్స్ కావాలని, సరైన కారణం లేకుండా వాడొద్దనే అంశాలను కొట్టిపారేసింది.

ఇతర రాష్ట్రాలైన కాలిఫోర్నియా లాంటి వాటిలోనూ ఇవే చట్టాలు అమలవుతున్నాయి. కోర్టు నియమాల ప్రకారం.. పబ్లిక్ లో తుపాకులు తీసుకెళ్లడాన్ని అడ్డుకుంటున్న వారికి వ్యతిరేకంగా తీర్పు వచ్చినట్లు అయింది.

డెమొక్రటిక్ ప్రెసిడెంట్ జో బైడెన్ మాట్లాడుతూ.. కామన్ సెన్స్, రాజ్యాంగం మనల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సమాజపరంగా మనం ఇంకా ఏదో చేయాలి. అమెరికన్లను కాపాడుకోవడం కంటే ఇంకేం చేయాలి. దేశవ్యాప్తంగా అమెరికన్లు గన్ సేఫ్టీ కావాలని పిలుపునివ్వాలి” అని అన్నారు.

Read Also: ర‌ష్యాపై భారత్ మ‌రింత ఒత్తిడి పెంచాలి: అమెరికా

మే నెలలో బహిరంగంగానే తుపాకులతో కాల్పులు జరిపి పలువురు మృతికి కారణమైనప్పటికీ తుపాకులు తీసుకెళ్లడం అనేది ప్రాథమిక హక్కు అని చెప్పింది కోర్టు.

“నేటి తీర్పు అమెరికా అంతటా పురుషులు, మహిళలకు మంచి విజయం NRA నాయకత్వంలో దశాబ్దాలుగా సాగిన పోరాట ఫలితం” అని NRA ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వేన్ లాపియర్ ఒక ప్రకటనలో తెలిపారు.