అమెరికాలో ఆకలి కష్టాలు.. ఫుడ్ ఫ్యాకెట్ల కోసం ఫుడ్ బ్యాంక్స్‌ దగ్గర భారీ క్యూలో నిలబడిన అమెరికన్లు

  • Published By: sreehari ,Published On : April 20, 2020 / 02:41 AM IST
అమెరికాలో ఆకలి కష్టాలు.. ఫుడ్ ఫ్యాకెట్ల కోసం ఫుడ్ బ్యాంక్స్‌ దగ్గర భారీ క్యూలో నిలబడిన అమెరికన్లు

అమెరికాలో కరోనా వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. 2 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. తిండి కూడా దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వం ఉచితంగా అందించే ఫుడ్ బ్యాంకుల కోసం గంటల కొద్ది అమెరికన్లు క్యూలో నిలబడుతున్న పరిస్థితి నెలకొంది. న్యూ ఓర్లాన్సీ నుంచి డెట్రాయిట్ వరకు ఇదే పరిస్థితి నెలకొంది. అమెరికాలో ఫుడ్ బ్యాంకుల దగ్గరకు వెళ్లడం చాలామందికి తొలిసారి అనుభవంగా చెప్పవచ్చు.

పెన్సిల్వేనియాలోని ఓ ఫుడ్‌ సెంటర్‌ దగ్గర దాదాపు వెయ్యి కార్లు క్యూలో ఉన్నాయి. ఫుడ్ కోసం ఎంతమంది ఇలా ఎదురుచూస్తున్నారో చూస్తూనే ఆందోళన కలిగిస్తోంది. ఓహియోలో మాత్రం రాత్రికి రాత్రే ఫుడ్‌ సెంటర్లలో 30 శాతం డిమాండ్‌ పెరిగిపోయింది. ఫుడ్ కోసం ఎదురుచూసేవారంతా గంటల తరబడి క్యూలో నిలబడాల్సి దుస్థితి వచ్చింది. 

చైనాకు ట్రంప్‌ వార్నింగ్ :
డ్రాగన్ చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పీకల్దాకా కోపంతో ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని ట్రంప్ విరుచుకపడ్డారు. కరోనా వ్యాప్తికి చైనానే కారణమని తెలిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. వైరస్‌ వ్యాప్తి గురించి చైనాకు తెలిసినప్పటికీ బాధ్యతారాహిత్యంతో ప్రవర్తించిందని ఆయన ఆరోపించారు. కరోనాకు చైనానే కారణమని తేలితే వదలిపెట్టేది లేదు. 1917 తర్వాత ఇంతటి స్థాయిలో ప్రాణనష్టాన్ని చూడలేదన్నారు.

కరోనా వ్యాప్తిపై చైనా పారదర్శకంగా లేదని, చైనాలో వైరస్ ఉద్భవించినప్పుడు అమెరికా సాయం చేస్తానని తిరస్కరించడాన్ని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ ఎంత ప్రాణాంతకమో చైనాకు ముందే తెలుసునని, అందుకే అమెరికా సాయం చేస్తానన్నా తిరస్కరించిందని గుర్తు చేశారు. చైనాలో కరోనా మరణాల సంఖ్య విషయంలో వాస్తవాలు కప్పిపుచ్చుతోందని ట్రంప్‌ ఆరోపించారు. అమెరికాలో కంటే కూడా చైనాలోనే కరోనా మృతుల సంఖ్య ఎక్కువ ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. 

Also Read | కరోనా ఎఫెక్ట్, పెళ్లి కాదేమోనని ఆత్మహత్య