China vs Taiwan: తైవాన్ డిఫెన్స్ ఉన్నతాధికారి అనుమానస్పద మృతి

యాంగ్ లీషింగ్ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పెలోసీ తైవాన్ లో పర్యటించి వెళ్లిన వెంటనే చైనా ప్రతీకార చర్యలకు దిగడం తెలిసిందే. తైవాన్ చుట్టూ యుద్ధ విన్యాసాలు చేస్తోంది. ఈ తరుణంలో యాంగ్ లీషింగ్ మరణించడమే అనుమానాలకు తావిస్తోంది. చైనా సైనిక విన్యాసాలపై తైవాన్ తీవ్రంగా స్పందించింది. తమ భూభాగంపై దాడకి చైనా సన్నాహాలు చేస్తోందని ఆరోపించింది. చైనా చేస్తున్న విన్యాసాల్లో భాగంగా కొన్ని క్షిపణులు తైవాన్ మీదుగా ప్రయాణించినట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

China vs Taiwan: తైవాన్ డిఫెన్స్ ఉన్నతాధికారి అనుమానస్పద మృతి

Amid China vs Taiwan top Taiwanese defence official found dead in hotel room

China vs Taiwan: తైవాన్, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తైవాన్ రక్షణ శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి అనుమానస్పద స్థితిలో మృతి చెందడం చర్చనీయాంశమైంది. తైవాన్ మిలిటరీ ఆధ్వర్యంలో పనిచేసే పరిశోధన, తయారీ విభాగం ‘ఎన్‌సీఎస్‌ఐఎస్‌టీ’ (నేషనల్ చుంగ్-షాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) డిప్యూటీ డైరెక్టర్ యూ యంగ్ లీ-హింగ్ పని చేస్తున్నారు. శనివారం ఉదయం దక్షిణ తైవాన్‌లోని ఓ హోటల్ గదిలో యాంగ్ లీషింగ్ అచేతనంగా ఉండడాన్ని గుర్తించినట్టు నేషనల్ చంగ్ షాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకటన విడుదల చేసింది. మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Musk on Tesla: ఒకవేళ నన్ను ఏలియన్స్ కిడ్నాప్ చేసినా..?

యూ యంగ్ పని నిమిత్తం దక్షిణ తైవాన్‌లోని పింగ్‌తుంగ్‌కు వెళ్లారు. ఈ ఏడాది ఆరంభంలోనే క్షిపణుల ఉత్పత్తికి సంబంధించిన పలు ప్రాజెక్టుల పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టినట్లు అంతర్జాతీయ మీడియా ఒకటి తెలిపింది. చైనా ముప్పు పెరిగిపోతున్న నేపథ్యంలో తైవాన్ మిలిటరీ సారధ్యంలో పనిచేసే ఎన్‌సీఎస్‌ఐఎస్‌టీ క్షిపణుల ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ఏడాది చివరి నాటికి 500 మిసైళ్లను ఉత్పత్తి చేయాలనుకుంటోంది. యుద్ధ సామర్థ్యాలను పెంచుకోవాలనే లక్ష్యంలో భాగంగా క్షిపణుల ఉత్పత్తిపై దృష్టిపెట్టింది. ఇందుకుతగ్గట్టే ఎస్‌సీఎస్ఐఎస్‌టీ ప్రస్తుతం దక్షిణ తైవాన్‌లోని జిపెంగ్ మిలిటరీ ఫెసిలిటీలో క్షిపణులను వరుసగా పరీక్షిస్తోంది. ఈ మిసైళ్లు 7,620 మీటర్ల ఎత్తువరకు చేరుకోగలుగుతున్నట్టు తొలి మూడు రౌండ్లలో తెలిసింది. పింగ్‌తుంగ్ కౌంటీలోని జిపెంగ్ మిలిటరీ బేస్‌లో ఆగస్టు 3న ఈ ప్రయోగాలు మొదలవ్వగా ఆగస్టు 18న ముగియనున్నాయని వెల్లడించింది. సముద్ర తీరంలో డేంజర్ జోన్‌‌ తప్పించేందుకుగానూ విమానాలు, నౌకలను తైవాన్ ఉపయోగిస్తోందని ఓ కథనం వివరించింది.

యాంగ్ లీషింగ్ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పెలోసీ తైవాన్ లో పర్యటించి వెళ్లిన వెంటనే చైనా ప్రతీకార చర్యలకు దిగడం తెలిసిందే. తైవాన్ చుట్టూ యుద్ధ విన్యాసాలు చేస్తోంది. ఈ తరుణంలో యాంగ్ లీషింగ్ మరణించడమే అనుమానాలకు తావిస్తోంది. చైనా సైనిక విన్యాసాలపై తైవాన్ తీవ్రంగా స్పందించింది. తమ భూభాగంపై దాడకి చైనా సన్నాహాలు చేస్తోందని ఆరోపించింది. చైనా చేస్తున్న విన్యాసాల్లో భాగంగా కొన్ని క్షిపణులు తైవాన్ మీదుగా ప్రయాణించినట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

UP: అత్యాచారం కేసులో బీఎస్‭పీ ఎంపీకి ఊరట