Rajnath Singh: రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో అణ్వస్త్ర ప్రయోగం వద్దు.. రష్యాను కోరిన రాజ్‌నాథ్ సింగ్

రష్యా-యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఏ దేశమూ, ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వస్త్రాలు ప్రయోగించకూడదని సూచించింది ఇండియా. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ మంత్రితో దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడారు.

Rajnath Singh: రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో అణ్వస్త్ర ప్రయోగం వద్దు.. రష్యాను కోరిన రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh: ప్రస్తుతం రష్యా-యుక్రెయిన్ మధ్య నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వస్త్రాలు ప్రయోగించవద్దని రష్యాకు సూచించింది భారత్. రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షొయిగుతో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం ఫోన్‌లో మాట్లాడారు.

WhatsApp: వాట్సాప్ నిలిచిపోవడానికి కారణం ఇదే.. కంపెనీ ఏం చెప్పిందంటే

ఈ సందర్భంగా ప్రస్తుత సంక్షోభం గురించి షొయిగు, రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. షొయిగు మాట్లాడుతూ యుక్రెయిన్ తమ దేశంపై ‘డర్టీ బాంబ్’ ప్రయోగించేందుకు ప్రయత్నిస్తోందని, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని వివరించారు. అయితే, రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ ఇరు దేశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వస్త్రాల ప్రయోగం జోలికి వెళ్లకూడదని సూచించారు. ‘‘చర్చలు, దౌత్యపరమైన మార్గాల ద్వారా మాత్రమే ప్రస్తుత సంక్షోభానికి ముగింపు దొరుకుతుంది. మానవతా సిద్ధాంతాలకు వ్యతిరేకమైన అణ్వస్త్రాల జోలికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదు’’ అని రాజ్‌నాథ్ సూచించారు.

Ghaziabad: పార్కింగ్ విషయంలో గొడవ.. తలపై ఇటుకతో కొట్టి వ్యక్తి హత్య.. వీడియోలో రికార్డైన ఘటన

ఈ చర్చలకు సంబంధించిన వివరాల్ని ఇటు భారత రక్షణ శాఖ, అటు ఇండియాలోని రష్యాకు చెందిన దౌత్య కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం రష్యా-యుక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ‘డర్టీ బాంబు’లు ప్రయోగించవచ్చనే ప్రచారం కూడా జరిగింది. దీంతో యుక్రెయిన్‌లోని భారత పౌరుల్ని వెంటనే ఆ దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఇండియా సూచించింది.