Golden Car : డబ్బుంటే దర్పం చూపించాలా? ‘బంగారు కారు’పై ఆనంద్ మహీంద్రా

యూఎస్ లో స్థిరపడిన ఓ భారతీయుడు బంగారంతో తయారుచేసిన ఫెరారీ స్పోర్ట్స్ కారులో షికారు చేశాడు. ఈ కారు గురించి..సదరు వ్యక్తి చేసిన హల్ చల్ గురించి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్రా తనదైన శైలిలో స్పందించారు..

Golden Car : డబ్బుంటే దర్పం చూపించాలా? ‘బంగారు కారు’పై ఆనంద్ మహీంద్రా

Golden Ferrari Car

Golden Ferrari Car in Usa : డబ్బులున్న మారాజులు చాలామంది చాలా సాదాసీదాగా ఉంటారు. కానీ కొంతమంది మాత్రం డాబు..దర్పం చూపిస్తుంటారు. అందరూ తమ గురించి చెప్పుకోవాలని..తమకు చూసి అబ్బా..వాడికేంటిరా..పెట్టి పుట్టాడురా..మహారాజులాంటి జీవితం అని అనుకోవాలనుకుంటారు. అటువంటి ఓ వ్యక్తి చూపించిన డాబు..దర్పం గురించి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ద్వారా స్పందిస్తూ..ఎంత డబ్బుంటే మాత్రం మరీ ఇంత దర్పమా?అన్నారు. ఆసక్తికర విషయాలపై సోషల్ మీడియా ద్వారా స్పందించే ఆనంద్ మహేంద్రా యూఎస్ లో ఓ వ్యక్తి ‘బంగారంతో తయారు చేసిన కారు’పై షికారు గురించి స్పందించారు. ఇంతకీ ఆ కారు గురించి విశేషాలు ఏమిటంటే..

యూఎస్ లో స్థిరపడిన ఓ భారతీయ అమెరికన్ పౌరుడు బంగారంతో తయారుచేసిన ఫెరారీ స్పోర్ట్స్ కారులో షికారు చేశాడు. అచ్చమైన బంగారాన్ని ఈ ఫెరారీ స్పోర్ట్స్ కారు తయారీలో ఉపయోగించారు. ఈ కారును ఇతర అమెరికన్లు ఎంతో అద్భుతాన్ని చూసినట్లుగా సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా..సదరు వ్యక్తి ఎంతో దర్పం ఒలకబోస్తూ గోల్డెన్ కారులో రివ్వున దూసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో..ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దీనిపై ఆనంద్ మహేంద్రా స్పందిస్తూ..డబ్బు ఉన్నంత మాత్రాన సంపన్నులు ఈ విధంగా ఖర్చు చేయకూడదన్నది దీని ద్వారా నేర్చుకోదగిన పాఠం అని ఆనంద్ వివరించారు.ఈ విషయం సోషల్ మీడియాలో ఎందుకింత వైరల్ అవుతుందో అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. ఆనంద్ మహీంద్రా పోస్టుల్లోని అంశాలు తప్పకుండా ఆలోచింపజేసేవిగా ఉంటాయనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.

టాలెంట్ ఎక్కడున్నా ప్రోత్సహించేలా పోస్టులు పెట్టే ఆనంద్ మహేంద్రా పోస్టుల ద్వారా ఆయన సింపుల్ సిటీని గురించి అర్థం చేసుకోవచ్చు..దటీజ్ ఆనంద్ మహేంద్రా అనేలా ఆయన పోస్టులు ఉంటాయి.అందుకే ఆయన ఒక పోస్టు పెట్టారు అంటే ఏదో విషయం..విశేషం ఉండే ఉండి తీరుతుందని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.