Steel lunch box :న్యూయార్క్‌లో మహిళ చేతిలో స్టీల్ లంచ్‌బాక్స్..ఆనంద్ మహేంద్రా

న్యూయార్క్ లో ఓ మహిళ ఆఫీసు బ్యాగుతో పాటు ఓ స్టీల్ లంచ్ బాక్స్ పట్టుకెళ్లటంపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్రా వినూత్న కామెంట్ చేశారు.

Steel lunch box :న్యూయార్క్‌లో మహిళ చేతిలో స్టీల్ లంచ్‌బాక్స్..ఆనంద్ మహేంద్రా

New York Women Steel Lunch Box

New York woman carrying steel dabba : ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాకు న్యూయార్క్ వీధుల్లోని ఓ మహిళను చూసి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. అంతే వెంటనే ఆఫోటోను షేర్ చేస్తూ తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు. ఆ ఫోటోకు ‘న్యూయార్క్, సెంట్రల్ పార్క్, డబ్బావాలి’ అని కాప్షన్ కూడా పెట్టారు. ఇంతకీ ఆ ఫోటో ఏమిటంటే..ఓ ఉద్యోగిని చేతిలో ఓ స్టీల్ క్యారియర్ఉంది. ఆ కేరియర్ చూసిన ఆనంద్ మహేంద్రాకు చిన్ననాటి గుర్తులు తలంపుకొచ్చాయి.

స్టీల్ టిఫిన్ బాక్సులతో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక జ్ఞాపకం ముడిపడి ఉంటుంది. స్కూలుకు లంచ్ బాక్సు తీసుకెళ్లడమో..పొలంలో భర్తకు భార్య క్యారియర్ పంపిచటమో..ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడు స్టీల్ క్యారియర్ లో భోజనం పట్టుకెళ్లటం. పని ఏదైనా రోజువారి కూలీలు స్టీల్ క్యారియర్లలో ఇప్పటికీ తీసుకెళుతుంటారు. రెండు మూడు గిన్నెలు ఉండే ఆ స్టీల్ క్యారియర్ లో ఒకదాంట్లో అన్నం. మరో గిన్నెలో కూర..ఇంకో గిన్నెలో పెరుగన్నం ఇలా రకరకాల ఆహారాలు పెట్టుకుని పట్టుకెళ్లటం గురించి అందరికీ తెలిసిందే. అటువంటి క్యారియర్ లో ప్రేమించే వ్యక్తులకు అందించడమో.. మొదటిసారి లంచ్ బాక్స్… ఇలాంటివే ఎన్నో.. ఎన్నెన్నో గుర్తుకొస్తుంటాయి. ఇది పూర్తిగా ఇండియన్ కల్చర్.

ఆ స్టీల్ డబ్బాను ఆఫీసుకు వెళ్లే ఓ మహిళ చేతుల్లో.. న్యూయార్క్ వీధుల్లో చూస్తే చాలామందికి అదే గుర్తుకొస్తాయి. ముంబైలో పేరుమోసిన ‘డబ్బావాలా’ సేవలను గుర్తుచేసేలా ఈ పిక్ కు డబ్బావాలి అని పెట్టడంతో.. ఇది ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. ఆయన పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే వేలాది లైక్‌లు, వందలాది షేర్లు అయ్యాయి. ఇంతకీ ఈ ఫొటోలో ఏముంది అంటే..

వైరల్ పిక్ వివరాల్లోకి వెళితే..ఓ మహిళ తన ఆఫీసు బ్యాగ్‌తో పాటు మూడు గిన్నెల స్టీల్ టిఫిన్ పట్టుకుని వెడుతుండడం కనిపిస్తుంది. దీనికి నెటిజన్ల నుంచి అనేక భావోద్వేగబరితమైన కామెంట్స్ వస్తున్నాయి. ఈ పోస్టుకు స్పందిస్తూ.. నెదర్లాండ్స్‌లోని ఓ భారతీయ యువతి.. తన దగ్గరున్న టిఫిన్ బాక్సు ఫోటో షేర్ చేసింది. దీంతోపాటు ‘నేనిప్పుడు పెద్దదాన్ని అయిపోవచ్చు… కానీ చిన్ననాటి డబ్బా నాకు బాగా గుర్తుకువచ్చింది. చిన్ననాటి గుర్తులు కళ్లముందు కదలాడాయి. ఈ మధ్య ఇక్కడ కొనుకున్నా దీన్ని. ఇది మా అమ్మకు పెడితే. ఇంట్లో ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటూ నవ్వుకుంది..’ అని కాస్త ఎమోషనల్ అయ్యింది.

మరో డబ్బావాలాల వీరాభిమాని “డబ్బావాలా భారతదేశానికి గర్వకారణం, చాలా మంది పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తి. వారు పర్ ఫెక్షన్, 100శాతం కష్టార్జితానికి..కమిట్ మెంటకు చిహ్నాలు. అలాగే న్యూయార్క్‌లో డబ్బావాలి ఎందుకు కాకూడదు అంటూ కామెంట్ చేశారు.మరికొందరు నెటిజన్లు ఆ టిఫిన్ లో ఏం పెట్టి తీసుకెళుతోందో ఆమె..‘పప్పు, అన్నం, చపాతీ ఉన్నాయా.. లేక బర్గర్,పీజ్జా, శాండ్ విచ్ లా?’ అంటూ పాశ్చాత్స ఫుడ్ కల్చర్ ను గుర్తుచేశారు. ఇంకొకరు “స్టీల్ డబ్బాస్ … చిన్ననాటి జ్ఞాపకాలకు తట్టి లేపాయి’ అంటే మరొకరు స్టీల్ డబ్బానే ఓ “భావోద్వేగం” అంటూ ఇలా ఎవరికి తోచిన గుర్తుల్ని వారు కామెంట్స్ రూపంలో పెట్టారు.