Naohun Tradition: వ‌ధూవ‌రుల‌ను ర్యాగింగ్‌ చేసే సంప్రదాయం..రద్దు చేయాలంటున్న జనాలు

పెళ్లిలో వధూవరులను సరదాగా ఆట పట్టించటం ఓ వేడుక. కానీ చైనాలో ఏకంగా దారుణంగా కొట్టటం..బాంబులు పెట్టటం..నీళ్లల్లో పడేయటం వంటి సంప్రదాయాలు ప్రమాదకరంగా మారాయి. దీంతో ఆ సంప్రదాయాన్ని రద్దు చేయాలనే నిర్ణయించారు చైనీయులు.ఇప్పటికే అది కొన్ని ప్రాంతాల్లో రద్దు అయినా కొన్ని ప్రాంతాలల్లో మాత్రం కొనసాగుతోంది. ఈక్రమంలో పలు సంప్రదాయం పేరుతో ప్రమాదాలు జరుగుతుండటం..మనోవేదనలకు కారణమయ్యే ఈ సంప్రదాయాన్ని రద్దు చేయాలంటున్నారు.

Naohun Tradition: వ‌ధూవ‌రుల‌ను ర్యాగింగ్‌ చేసే సంప్రదాయం..రద్దు చేయాలంటున్న జనాలు

Ancient Chinese Custom Takes A Disturbing Turn..

China Naohun Tradition : మన దేశంలో పెళ్లి అంటూ సందడి..సరదాలు..సరసాలు అన్నట్లుగా ఉంటుంది.బావా మరదళ్ల వేళాకోళాలు. వరసయ్యేవారితో సరదాలు ఇలా సందడి వాతావరణం ఉంటుంది. అలాగే వధూవరులు వరసయ్యేవారు ఆటపట్టిస్తుంటారు. అది సంప్రదాయం కాదు.. ఓ సరదా కోసం మాత్రమే.కానీ చైనాలో మాత్రం ఏకంగా ర్యాగింగ్ చేసే సంప్రదాయం ఉంది. వ‌ధూవ‌రుల‌ను డిస్ట‌ర్బ్ చేయ‌డం…తిట్టటం..కొట్టటం..పిడిగుద్దులు గుద్దటం..నీళ్లలో ముంచేయటం..ఎత్తునుంచి తోసేయటం వంటి ర్యాంగింగ్‌ చేస్తుంటారు. ‘న‌వోహున్’ అనే సంప్రదాయం పేరుతో వధూవరుల్ని వేధిస్తుంటారు. వ‌రుడైనా… వారి బంధుమిత్రులు ఎవ‌రైనా.. పెళ్లి వేడుక‌లో చాలా హంగామా సృష్టిస్తారు. ముచ్చ‌ట‌గా త‌యారైన వ‌ధూవ‌రుల‌ను వేధిస్తుంటారు.కాగా ఇవి కూడా సరదాగా మొదలై శృతిమించిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో వధూవరులు గాయపడుతున్నారు కూడా. సరదాలు కాస్తా ప్రమాదాలుగా మారుతున్నాయి. దీంతో న‌వోహున్ సంప్ర‌దాయాన్ని ర‌ద్దు చేయాల‌ని ఇప్ప‌టికే చైనాలోని కొన్ని రాష్ట్రాలు నిర్ణ‌యించాయి. కొన్ని జిల్లాల్లో నిషేధాలు అమ‌లు చేస్తున్నాయి.

మన సంప్రదాయంలో వరుడు పెళ్లి వేడుకలో చెంబూ కర్రా పట్టుకుని ‘కాశీ’పోతానంటాడు. దానికి బావమరిది వరుస అయ్యేవారు ‘అమ్మో బావా కాశీకి వెళ్లొద్దు..మా అక్కనిచ్చి పెళ్లి చేస్తా బావా..అంటాడు. అదే చైనాలో అయితే..ఏకంగా పెళ్లిని అడ్డుకోవటానికి స‌ర‌దాగా ఈ ఆట మొదలవుతుంది. అలా వ‌రుడి బట్టలు విప్పేయటం..ఎత్తిప‌డేయ‌టం, వరుడు ఒంటికి బాంబులు పెట్టి పేల్చ‌డం, నీళ్లల్లో ముంచేయటం, ఎత్తుమీదనుంచి తోసేయటం..దొరికింది పట్టుకుని కొట్టటం లాంటి పిచ్చి పిచ్చి చేష్ట‌లు చేస్తుంటారు.

విన‌డానికి ఇవి సరదాగానే ఉన్నా.. పెళ్లి చేసుకోబోతున్న కొత్త జంట‌ల‌కు మాత్రం ఈ సాంప్ర‌దాయం టెన్ష‌న్..టెన్షన్ గా ఉంటుంది. నావోహున్ పేరుతో ఇంటికి వచ్చిన అతిథులు వదూ వరుల్ని నానా గలాటాచేస్తుంటారు. దీంతో కొన్ని సరదాలు ప్రమాదాలను తెచ్చిపెడ్తున్నాయి. మరికొన్ని సందర్భాల్లో విషాదాల‌ను కూడా కలిగిస్తున్నాయి. పెళ్లి కూతుర్ని ఆట‌ప‌ట్టించే పేరుతో .. వారిని వేధిస్తున్నార‌ని..ముద్దులు పెట్టటం..శరీరంపై ఎక్కడంటేఅక్కడ పట్టుకుని నొక్కు లైంగిక వేధింపులు చేస్తున్నారనే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. న‌వ్వులాట‌గా మొద‌ల‌య్యే ఈ ఆట..మనోవేద‌నకు దారితీస్తోంది.

ఇటీవ‌ల కొన్ని హృద‌య‌విదార‌క‌ర సంఘ‌ట‌న‌లు ఇలా ఉన్నాయి…
ఓ పెళ్లిలో వ‌రుడిని వేధించాల‌ని అనుకున్న అతని ఫ్రెండ్స్ అత‌న్ని త‌ల‌కిందులుగా ఎత్తిప‌డేశారు. దీంతో అత‌నికి త‌ల‌కు పెద్ద గాయం అయ్యింది. మరొక వరుడికైతే .. బాంబులు పెట్టి మ‌రీ పేల్చేశారు. దాంతో ఆ వ‌రుడు పెద్ద గాయాలు కాకపోయిన ఇబ్బంది కలిగించే గాయాలు అయ్యాయి. ఇలా వేధింపు ఘ‌ట‌న‌లు ఎక్కువ‌డడంతో.. ఆ పురాత‌న సాంప్ర‌దాయానికి స్వస్తి చెప్పాలని లేకుంటే దీన్ని ఆసరాగా చేసుకుని సంప్రదాయం పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు పెరుగుతున్నాయి.

న‌వోహున్‌కు సంప్రదాయం..
పెళ్లిలో సంప్రదాయంగా మొదలైన ఈ ‘న‌వోహున్‌’ సంప్రదాయానికి చాలా చరిత్ర ఉంది. హ‌న్ సామ్రాజ్యం(202 బీసీ.. 220 ఏడీ)లో ఈ వింత ఆచారం ఉండేద‌ట‌. దీన్ని అప్ప‌ట్లో నావో డాంగ్‌ఫాంగ్ (పెళ్లి వేళ కొత్త జంట‌ను టీజ్ చేయ‌డ‌ం) అనేవారు. కానీ అదిరాను రాను సంప్రదాయం కాస్తా ఇబ్బందికరంగా మారింది. మనోవేదనగా మారింది. వ‌ధూవ‌రుల‌తో సరదాగా ఉండటానికి కొన్ని ఆటలు ఆడేవారు. ‘కొత్త కోడ‌ల్ని మామ ఎత్తుకుని న‌డుచుకుంటూ వెళ్లటం ఉండేదట. ఆ సంప్రదాయం ఇద్ద‌రి కుటుంబాలు స్నేహితుల్లా కలిసిమెలిసి ఉండానికి ఉపయోగపడేది. ఎందుకంటే పురాత‌న కాలంలో..పిల్లలను ఇచ్చి పుచ్చుకునే కుటుంబాలకు పరిచయాలు ఉండేవికాదు. పెళ్లిచూపులు కూడా ఉండేవికాదు. పైగా టీనేజ్ పెళ్లిళ్లు చేసేసేవారు.

న‌వోహున్ పేరుతో పెళ్లి కూతుర్ని, పెళ్లి కుమారుడిని ఏడ్పించిన ఘ‌ట‌న‌లు ఇటీవ‌ల కాలంలో చైనా చాలా ఎక్కువ‌య్యాయి. వాటికి సంబంధించిన వీడియోలు చూడటానికి బాగానే ఉన్నా..వధూవరులకు మాత్రం అది ఇబ్బందే. చైనాలోని గాంగ్‌జూ, వూహో, చెంగ్డూ, కింగ్‌షాన్ ప్రాంతాల‌తో పాటు మంగోలియాలో కూడా ఈ సంప్ర‌దాయంపై నిషేధం విధించారు. ఈ క్రమంలో ఈ సంప్రదాయాన్ని మొత్తం రద్దు చేయాలని అంటున్నారు.